ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రజలు అందరూ సహకరించాలని దీని కోసం అందరూ ఇంటి పట్టునే  ఉండాలని కోరుతూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలందరూ లాక్ డౌన్  విజయవంతంగా పాటిస్తున్నారు. దాదాపు అందరు  ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దీంతో  రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సమయంలో అన్ని సినిమా షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్  సమయంలో సెలబ్రిటీలను ఇంటికే పరిమితమయ్యారు. 

 

 

 అయితే ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్ డౌన్  సమయంలో ఖాళీ టైం దొరకడం తో హాయిగా రెస్ట్ తీసుకోవడం కాదు.. ప్రజలందరినీ చైతన్యపరిచేందుకు ముందుకొస్తున్నారు చాలా మంది సెలబ్రెటీలు. ఇలా ప్రజలందరినీ చైతన్యపరుస్తున్న  చాలామంది సెలబ్రిటీలలో ముందు వరుసలో ఉన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసులు నమోదు అయినప్పటి నుంచి... ఎప్పటికప్పుడు తమ అభిమానులను చైతన్యపరుస్తూనే  ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. హీరోలకు ఆదర్శంగా నిలుస్తుండంతో పాటు ప్రజలందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు... పాటించాల్సిన నిబంధనలు గురించి ఎప్పటికప్పుడు క్లుప్తంగా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

 

 

 ఇక లాక్ డౌన్  సమయంలో చిత్రం  పరిశ్రమ విషయంలో కూడా బాధ్యతగా  మెగాస్టార్ చిరంజీవి... లాక్ డౌన్  సమయంలో సినిమా షూటింగులు ఆగిపోయి పూర్తిగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ  అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టి సినీ కార్మికులు అందరికీ చేయూతనిస్తూ అత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విరాలాలు సేకరిస్తూ కష్టకాలంలో సినీ కార్మికులకు ఆదుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా ప్రజలందరూ ఇంట్లో ఉండి ప్రాణాలను రక్షించుకోండి ... సామాజిక దూరం పాటిస్తే కరోనా  వయసు తరిమికొట్టొచ్చు అంటూ ప్రజలందరిలో దైర్యం నింపుతున్నారు . అందుకే చిరంజీవి కరోనా పై  యుద్ధంలో ఆదర్శంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: