జగన్ అంటేనే జగన్ మొండి అని విపక్షాలు అంటారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే వెటకారంగానూ, కోపంగా ముద్దు పేరుగా జగన్ మొండి అనేస్తూంటారు. ఇక జగన్ అభిమానులు దాన్ని పట్టుదల అంటారు. ఆయన అనుకుంటే వెనక్కి తగ్గరని అంటారు. ఆయన రూటే డైరెక్ట్ రూట్ అంటారు.

 

మరి అదే ఇపుడు జగన్ కి చేటు తెస్తోందా. జగన్ తాను ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం వల్లనే కొందరికి చెడ్డ అయిపోతున్నారా. జగన్ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అతి బలవంతులతో యుధ్ధం చేస్తున్నారా. జగన్ కావాలని పెట్టుకున్నారా లేక అది ఆయనకు అనివార్యం అయిందా అన్న చర్చ కూడా సాగుతోంది.

 

జగన్ కి ఇపుడు ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం ప్రధాన శత్రువుగా మారిందా అన్నది హాట్ టాపిక్ గా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో కూడా తీసుకున్న అనేక నిర్ణయాలు చూస్తే అది వారికి ఇబ్బందిగా మారాయని అంటున్నారు.

 

దాంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంటోందని కూడా అంటున్నారు. వారంతా కూడా లోలోపల  రగులుతున్న్నారని కూడా అంటున్నారు. అది ఇన్నాళ్ళకు సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాటల్లో బయటపడిందని కూడా అంటున్నారు.

 

రాయపాటి వాడిన భాషను చూస్తే జగన్ని బెదిరించేలాగే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. దీని మీద ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారంటే ఆ తీవ్రత వైసీపీని ఎంతలా కుదిపేస్తుందో అర్ధమవుతోంది.

 

జగన్నే బెదిరించేలా రాయపాటి చేత ఈ ప్రకటన ఎవరు ఇప్పించారు. వెనక ఉన్నది ఎవరూ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి రాజకీయానికి కూడా దిగేందుకు తెర వెనక భారీ స్కెచ్ రెడీ చేస్తే మాత్రం ఏపీ ఎన్నడూ చూడని కొత్త పాలిటిక్స్ ని చూస్తుందని, అది ఏ వైపు నుంచి ఏ వైపునకు వెళ్తుందో కూడా ఎవరూ చెప్పలేరని అంటున్నారు. 

 

ఏది ఏమైనా జగన్ని భయపెట్టాలని, బెదిరించాలని చూస్తే ఆ పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని వైసీపీ నుంచి వస్తున్న వార్నింగు. మరి ఢీ అంటే ఢీ కొట్టే రాజకీయం ఏం ప్రమాదాన్ని ముందుకు తెస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: