కొద్దీ రోజుల క్రితం పంజాబ్ లోని పటియాలాలో జరిగిన ఘర్షణ లో ఏఎస్ ఐ హర్జిత్ సింగ్ చేతిని నిహంగ్ గ్యాంగ్ నరికిన విషయం తెలిసిందే. ఆతరువాత హర్జిత్ సింగ్ కు డాక్టర్లు శస్త్ర చికిత్స జరిపి విరిగిన చేయి ని విజయవంతంగా అతికించారు. ప్రస్తుతం హర్జిత్ సింగ్  కోలుకుంటున్నాడు. ఇక హర్జిత్ సింగ్ ధైర్య సాహసాలకు  గుర్తు గా పంజాబ్ ప్రభుత్వం అతనికి ప్రమోషన్ కలిపించింది. ఏఎస్ఐ గా వున్న హర్జిత్ సింగ్ ను ఎస్ ఐ గా ప్రమోట్ చేసింది. అలాగే ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు పోలీసులకు అవార్డులను ప్రకటించింది. 
 
గత ఆదివారం పంజాబ్ లోని పటియాలాలోని కూరగాయల మార్కెట్ వద్ద లాక్ డౌన్ అమలవుతుండగా ఉదయం బారికేడ్లను దూసుకుంటూ ఓ వెహికల్ వెళ్లగా దాన్ని అపి పోలీసులు వెహికిల్ పాస్ అడిగారు. అంతే  అందులో ప్రయాణిస్తున్న నిహంగ్స్ గ్యాంగ్ ఒక్కసారిగా పోలీసులపై దాడికి  దిగింది. ఈఘర్షణ లో ఆ గ్యాంగ్ లోని ఓ వ్యక్తి కత్తితో ఏఎస్ఐ హర్జిత్ సింగ్ఎడమ చేతిని తల్వార్ తో నరికాడు. చేయి తెగి దూరంగా పడగా అక్కడే వున్న ఓ వ్యక్తి ఆ చేతిని గాయపడ్డ హర్జిత్ సింగ్ కు  ఇచ్చాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా  హర్జిత్ సింగ్ ఆ తెగిన చేతిని మరో చేతితో పట్టుకొని  హాస్పిటల్ కు వెళ్ళాడు.  
 
చండీగఢ్ లోని పీజిఐఏంఈఆర్ హాస్పిటల్ లో సుమారు 7 గంటల పాటు హర్జిత్ సింగ్ కి సర్జరీ చేసి డాక్టర్లు తెగిన చేతిని అతికించారు. ఇక ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గ్యాంగ్ స్టర్ లే.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖ ను ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: