కేరళ అనేక అంశాల్లో దేశంలోనే ఫస్ట్‌.. అక్షరాస్యత, ప్రజాసంక్షేమం, ఆరోగ్యంలో దాని ముందు ఇతర రాష్ట్రాలు దిగదుడుపే... ఇప్పుడు కరోనాపై పోరాటంలోనూ కేరళ ఇతర రాష్ట్రాలకు, బయటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.  లోకల్‌ కాంటాక్ట్‌ దశలోనూ పెద్దగా కేసులు లేకుండా నిలువరించి ఆశాకిరణంగా మారింది.  భారత దేశంలో కరోనా లక్షణాలు మొదట కేరళాలో నమోదు అయ్యాయి.  ఇప్పుడు అక్కడే కరోనా కేసుల పూర్తి స్థాయిలో తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం కేరళలో కేవలం 167 యాక్టివ్‌ కేసులున్నాయ్‌.  218 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  

 

దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య యాక్టివ్‌ కేసుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో బుధవారం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాగా, నేడు (గురువారం) ఏడు కేసులు నమోదయ్యాయి. నేడు వెలుగు చూసిన ఏడు కేసుల్లో నాలుగు కన్నూరు, 2 కోజికోడ్, ఒకటి కసర్‌గడ్‌లో నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 27 మంది కరోనా రోగులు కోలుకోవడం ఊరటనిచ్చే అంశం.

 

వీటిలో  24 మంది కసర్‌గడ్‌కు చెందిన వారు కాగా, ఎర్నాకుళం, కన్నూరు, మళప్పురం జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, కోవిడ్ బారినపడి కోలుకున్న వారిలో కేరళ అగ్రస్థానంలో ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత కేరళలో కేసులు తగ్గిపోయాయి. ఇతర రాష్ట్రాల్లో లోకల్‌ కాంటాక్ట్ ద్వారా కేసులు పెరుగుతుంటే కేరళలో తగ్గాయి. కేరళ సర్కార్‌ బ్రేక్‌ ద చైన్‌ అనే నినాదం ఫలించింది. ప్రధాని మోడీ కన్నా ముందే కేరళ సీఎం విజయన్‌ లాక్‌ డౌన్‌ ప్రకటించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: