దేవినేని ఉమా...టీడీపీ సీనియర్ నేత. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఇక గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా వెలగబెట్టారు. అలా వరుసగా విజయాలు సాధించిన ఉమాకు, 2019 ఎన్నికల్లో చెక్ పడింది. మైలవరం నుంచి పోటీ చేసి, వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి ఉమాకు పెద్దగా పని ఉండటం లేదు.

 

అందుకే ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అసలు గ్యాప్ లేకుండా అదే పనిలో ఉంటున్నారు. ప్రస్తుతం కూడా కరోనా వ్యాప్తి పెరగకుండా జగన్ ప్రభుత్వం కృషి చేస్తున్న సరే, ఉమా విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా ఇలాగే విమర్శలు చేస్తే మంత్రి కొడాలి నాని గట్టి కౌంటర్లు ఇచ్చి, ఉమా పరువు తీసేసారు.

 

అయినా సరే ఉమా వెనక్కి తగ్గకుండా, జగన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా కూడా కరోనా టెస్టులు ఎందుకు చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. అలాగే ‘వైజాగ్ స్వామీజీ కొత్త తేదీ చెప్పారంట.. జూన్ 20 కల్ల విశాఖకు రమ్మన్నారంట.. ఈ స్వామీజీ గోల ఏంటో అర్థం కావడం లేదు’ అని పరోక్షంగా జగన్ విశాఖకు తరలి వెళుతున్నారనే విధంగా మాట్లాడారు. అది కూడా విశాఖలో ఉండే స్వరూపానంద సరస్వతి స్వామి మాటలు వింటూ జగన్ పాలన చేస్తున్నట్లు పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు.

 

ప్రస్తుతం జగన్ కరోనా వ్యాప్తిని అరికట్టడంపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రజలని కాపాడటంలో సీఎం దృష్టి పెట్టి ఉన్నారు. ఇక కరోనా ప్రభావం తగ్గాక, అప్పుడు అభివృద్ధిలో భాగమైన మూడు రాజధానులు ఏర్పాటులో భాగంగా విశాఖ నుంచి పాలన కొనసాగించవచ్చు. అది ప్రజల మేలు కోసం తీసుకున్న నిర్ణయం. అలాంటిది ఉమా గుడ్డిగా విమర్శలు చేస్తూ, మధ్యలోకి స్వామిజిని లాగుతూ రాజకీయం చేస్తున్నారు. అసలు ఇలా అర్థంపర్ధం లేని విమర్శలు చేస్తున్న ఉమా గోలేంటి ఎవరికి అర్ధం కాకుండా ఉందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.  ఓటమి దెబ్బకు ఉమా ఇలా మాట్లాడుతున్నారేమో అని, ఆయనని ఎవరికైనా చూపించమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: