ప్రపంచ ప్రజలను మరియు దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి మాట్లాడే ప్రతి సారి డోనాల్డ్ ట్రంప్ చైనా వైరస్ అని సంబోధిస్తారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు మీడియా ముందే గాని మరెక్కడైనా గాని ఈ విధంగానే బహిరంగంగా కరోనా ని చైనా వైరస్ గా అభివర్ణిస్తున్నారు. అమెరికాలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో చైనాపై అదేవిధంగా WHO పై తీవ్ర స్థాయిలో అవుతున్నారు ట్రంప్. ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి కరోనా వైరస్ విషయంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుండి వెళ్లాల్సిన నిధులను కూడా ఇకనుండి ఇవ్వము అని తేల్చి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాల్సిన 'WHO' చైనా తో కుమ్మక్కయి ఈ నాటకం ఆడిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

ఇదిలా ఉండగా ఇటీవల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పత్రిక ఒకటి చైనా దేశం కావాలనే ఈ కరోనా వైరస్ విషయంలో దొంగ ఆటలు ఆడినట్లు ఒక్కొక్కటీ వివరిస్తూ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సందర్భంలో డాక్టర్లు ఇది ఒక కొత్త వైరస్ అని అభివర్ణించారు. ఈ వైరస్ వల్ల మొదట ఇద్దరు చనిపోయిన టైములో ప్రభుత్వానికి ఈ విషయం తెలియ చెప్పడం జరిగింది. కానీ చైనా ప్రభుత్వం మాత్రం డాక్టరు ఇచ్చిన రిపోర్టులను తొక్కి పెట్టింది. జనవరి 14 కి చైనా ప్రభుత్వం ఇది భయంకరమైన వైరస్ ని గుర్తించడం జరిగింది. అయితే 14 నుండి 20 లోపు కరోనా వైరస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య మూడువేలు దాటింది.

 

ఇంతలా వైరస్ వ్యాప్తి చెందిన విషయాన్ని బయట ప్రపంచానికి కూడా చైనా ప్రభుత్వం తెలియజెప్పడానికి ముందుకు రాలేదట. అంతేకాకుండా ఈ వైరస్ థాయిలాండ్ లో కూడా వచ్చిన సమయంలో చైనా ని ప్రశ్నిస్తే పట్టించుకోలేదట. దీంతో యధావిధిగా చైనా దేశం నుండి ఇతర దేశాలకు రాకపోకలు జరగటంతో ఇంత భారీ నష్టం జరిగిందని తాజాగా ఈ పత్రిక బయట పెట్టింది. అంతేకాకుండా చైనా దేశంలో పండుగలు జరిగిన టైంలో కూడా దేశ ప్రజలను అప్రమత్తం చేయకుండా చైనా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని..అన్ని విషయాలు వెలుగులోకి వస్తే మొత్తం ప్రపంచమంతా ఏకమయి...ప్రపంచ పటంపై చైనాని లేకుండా చేస్తాయి అని ఈ అంతర్జాతీయ పత్రిక చెప్పుకొచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: