ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతోంది. దీంతో ప్రజలందరూ ఉద్యోగాలు వ్యాపారాలు బిజీ లైఫ్ మొత్తం పక్కన పెట్టేసి ఇంటికే పరిమితమయ్యారు. ఇక దేశంలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రజలు ఒక ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే  భయపడుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లుగా లాగ్ డౌన్  పాటిస్తూ కరోనా పై  యుద్ధం చేస్తోంది దేశ ప్రజానీకం. అయితే కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో... అన్ని రంగాల్లో  తీవ్ర స్థాయిలో నష్టపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుపేదల పరిస్థితి అయితే రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతున్నది . కనీసం తినడానికి తిండి కూడా లేదు... కరోనా  వైరస్ పై  పోరాటం చేయడం ఏమో కానీ తిండి  కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

 అయితే కరోనా  వైరస్ పై  పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ఎంతో మంది ప్రముఖులు భారీ విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి భారీ విరాళాలు అందజేసి తమ మంచి మనసు చాటుకున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తమ వంతుగా సాయం  చేస్తున్నారు. అయితే బాగా డబ్బున్న వారు విరాళాలు అందించడం ఇప్పుడు వరకు చాలానే జరిగాయి. కానీ కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నిరుపేదలు కూడా విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. 

 

 

 

 దేశం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అది చూసి తట్టుకోలేకపోతున్నా చాలా మంది నిరుపేదలు కూడా విరాళాలు అందజేసి తమ పెద్దమనుషుల చాటుకుంటున్నారు. సాయం చేయడానికి సంపద కాదు... మనసు ఉంటే సరిపోతుంది అంటూ నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయం చేసుకునే ఓ రైతు ఏకంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి 50 వేలు  విరాళం అందించాడు. డబ్బులు ప్రాణాలతో ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోగలమని  కానీ ప్రస్తుతం చాలా మంది చనిపోవడం తాను చూడలేకపోతున్నా అని అందుకే దేనికైనా ఉపయోగపడుతుందని 50,000 దానం చేస్తున్న అని రైతులు తెలిపారు. అంతే కాకుండా మరో మహిళ కూడా తన పెద్దమనసూ  చాటుకుంది. బీడీలు చుట్టి జీవనం సాగించే ఓ అమ్మాయి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి 20వేల రూపాయలు ఇచ్చింది. అయితే ఎంతో మంది వందల కోట్ల సంపద ఉన్నప్పటికీ విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రాని నేపథ్యంలో పేదరికంలో ఉన్నప్పటికీ విరాళాలు ఇస్తున్న వీళ్లు అసలైన నిజమైన సెలబ్రిటీలు.

మరింత సమాచారం తెలుసుకోండి: