భార‌త‌దేశంలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో కీల‌క అడుగులు ప‌డుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ ఈ మేర‌కు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. క‌రోనా ప‌రిస్థితిపై రోజువారీ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయ‌న ముఖ్య‌మైన‌ వివ‌రాలు తెలిపారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ)తో క‌లిసి కొత్త యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ తెలిపారు. గ‌తంలో భార‌త్ లో పోలియో కంట్రోల్ కోసం స‌హ‌క‌రించిన డ‌బ్ల్యూహెచ్ఓ స‌ర్వైలెన్స్ టీమ్స్ ను ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోనున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ చెప్పారు.

 

దేశంలో క‌రోనా కంటైన్మెంట్ జోన్ల‌లో వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌పై డ‌బ్ల్యూహెచ్ఓ ఫీల్డ్ ఆఫీస‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన‌ట్లు చెప్పారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 325 జిల్లాల్లో క‌రోనా కేసులు ఒక్క‌టి కూడా లేవ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ చెప్పారు. అలాగే గ‌త 28 రోజుల‌గా పుదుచ్చేరిలోని మ‌హె జిల్లాలో కొత్త‌గా కేసులు రాలేద‌ని తెలిపారు. అలాగే మ‌రో 27 జిల్లాల్లో గ‌డిచిన 14 రోజులుగా క‌రోనా కేసులు న‌మోదు కాలేద‌ని చెప్పారు.

 

ఇదిలాఉండ‌గా, దేశంలో కరోనా ప్రభావిత హాట్‌స్పాట్స్‌లో నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే హాట్‌స్పాట్‌గా గుర్తించని ప్రాంతాలకు ఏప్రిల్‌ 20 తదనంతరం కొంత వెసులుబాటు కల్పించేందుకూ నిర్ణయం తీసుకుంది. కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేందుకు నిర్ణయించింది. కోవిడ్‌-19 విస్తరణ ను అరికట్టడానికి దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చేనెల మూడోతేదీ వరకు పొడిగించిన నేప థ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధ వారం ఏకీకృత మార్గదర్శకాలు జారీ చేసింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయడమే గాక ఎలాంటి మినహాయింపులూ ఉండవని తెలిపింది. జన సంచారం ఉండకూడదన్నది. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని వివరించింది.
అన్ని దేశీయ, అంత ర్జాతీయ విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీస్‌లు, ఆటో, టాక్సీ సర్వీసులు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతర్రాష్ట్ర,సరిహద్దులు, అసెంబ్లీ హాల్స్‌ మూసివేస్తున్నట్టు తెలిపింది. అన్ని రకాల సామాజిక, రాజకీయ, క్రీడలు, ఎంటర్‌టైమెంట్‌ అకాడమిక్స్‌, సాంస్కృతిక, మత కార్యక్రమాలను సైతం అనుమతించలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: