ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రకటించినప్పుడు చాలా హైలెట్ గా ఉంటున్నాయి. ఇక అమలులోకి వచ్చే సరికి పెద్ద విషయం ఏమీ కనబడటం లేదు. ఇందువల్లే ఇప్పటిదాకా జగన్ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలలో ప్రతిపక్షాల కంటే న్యాయస్థానాల్లో నే ఎక్కువ ఎదురు దెబ్బ తగలటం జరిగింది. తాజాగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో జగన్ సర్కార్ జారీచేసిన 81, 85 జీవోలను హైకోర్ట్ కొట్టిపారేసింది. తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అవలంభించాలని పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ జీవోలను హైకోర్టు తప్పు పట్టింది. రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఏ చదువు చదువుకోవాలి అన్న దాని విషయంలో తల్లిదండ్రులు నిర్ణయిస్తారని.. వాళ్లు తెలుగు మీడియం చదువుతారా..? ఇంగ్లీష్ మీడియం చదువుతారా..? అన్నది వాళ్ల ఇష్టమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

 

ఇలాంటి విషయాల్లో పిల్లలపై ప్రభుత్వాలు ఒత్తిడి చేయకూడదని సూచించింది. వాస్తవానికి అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. కానీ తెలుగు మీడియం రద్దుచేసి అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలని సూచించడం జగన్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఇక్కడ. జగన్ పేద వాళ్లకి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అని తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి పొరపాటు లేదు. కానీ ఎప్పుడైతే తెలుగు మీడియా ని రద్దు చేయడం జరిగిందో న్యాయస్థానం దృష్టిలో అది పెద్ద తప్పు గా కనబడింది. ఈ పరిణామంతో జగన్ సర్కార్ కి కోర్టులో మొట్టికాయలు పడినట్లయింది.

 

అయితే ఒక ఇంగ్లీష్ మీడియం విషయంలోనే కాదు చాలా విషయాలలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాల దృష్టికి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతున్నాయి. ఈ పరిణామాలతో జగన్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా కొంత విమర్శలు చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. దీంతో సొంత పార్టీలో ఉన్న నాయకులు తాజాగా ఇంగ్లీష్ మీడియం పై వచ్చిన తీర్పుపై పార్టీ హైకమాండ్ అవగాహన రాహిత్యంతో పాటు మొండితనం గా ఏకపక్ష ధోరణి తో వ్యవహరించడంతో ఇటువంటి తీర్పులు రావటం లో తప్పేం లేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: