ప్రపంచంలో ఏ దుర్ముహూర్తంలో కరోనా వైరస్ ప్రబలిపోయిందో కానీ... అమెరికా లాంటి అగ్ర రాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  ఒకటి కాదు రెండు కాదు వెలల్లో మరణాలు..లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి  కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో మొత్తం 32,917 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.  గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

 

అంటే ఇక్కడ కరోనా వైరస్  కరాళ నృత్యం చేస్తుందో అర్థం అవుతుంది.   గతంలో చేర్చని కోవిడ్-19కు సంబంధించిన సంభావ్య మరణాలు కూడా ఉన్నాయి. కాగా, మొత్తం మరణాల్లో 3,778 సంభావ్య మరణాలను చేర్చినట్టు న్యూయార్క్ నగరం ప్రకటించింది. గురువారం రాత్రి నాటికి ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్ 31,071 మరణాలను నమోదు చేసింది. ఇందులో 4,141 సంభావ్య మరణాలు ఉన్నాయి. 

 

చైనాలో మొదలైన కరోనా మరణాలు ఇప్పుడు   అమెరికాలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత  ఇటలీ 22,170 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 19,130 మంది, ఫ్రాన్స్‌లో 17,920 మంది మరణించారు.  గత రెండు రోజులుగా ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎపిక్ సెంటర్‌గా మారిన న్యూయార్క్‌లోనే 12 వేల మందికిపైగా మృతి చెందారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: