ఈ కరోనా వచ్చి ప్రతి వారిని బాధిస్తుంది.. వైరస్ సోకిన వారితో పాటుగా.. ఇంట్లో ఉన్నవారి బాధలు కూడా వర్ణించలేకున్నాము.. ఇక తిరుగుబోతులకు వచ్చిన కష్టం అయితే మామూలుగా లేదు.. ఇదిగాక నిత్యం ఏదో ఒక పనిపెట్టుకుని బయట తిరిగేవారు కూడా ఇంట్లో బందీలుగా మారారు.. అయినా గానీ ఏదో ఒక సాకు అడ్డుగా పెట్టుకుని రొడ్డెక్కే వారున్నారు.. ఇలాంటి వారిని కట్టడి చేయాలంటే పోలీసులకు తలప్రాణం తోకకు వస్తుంది.. ఒకరో ఇద్దరికో సర్ధిచెప్పి పంపవచ్చూ.. కానీ దాదాపుగా ప్రజలందరు ఇలానే ఉన్నారు.. అందుకే ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు తమిళనాడులోని సేలం పోలీసులు వినూత్న ప్రయత్నం చేసి, విజయం సాధించారు..

 

 

అదేమంటే ఒకేసారి రోడ్డుపైకి వచ్చే వాహనాల విషయంలో ఒక చిన్న చిట్కాను అమలు చేస్తున్నారు.. ఇందులో భాగంగా ముందుగా రోడ్లపై ఒకేసారి ఎక్కువ వాహనాలు తిరగకుండా కట్టడి చేయాలి.. ఇందుకు గాను ఒక వాహనం వారంలో రెండు రోజులు మాత్రమే బయటకు వచ్చే విధంగా వాహనాల మడ్‌గార్డులకు, నంబర్‌ ప్లేట్లకు వేర్వేరు రంగులు వేశారు. అంటే, బ్లూ రంగు వేసిన వాహనాలు ఆది, గురువారాల్లో.. గోధుమ రంగు మార్క్‌ ఉన్న వాహనాలు సోమ, శుక్రవారాల్లో, పసుపు రంగు వేసిన వాహనాలు మంగళ, శనివారాల్లో, ఎరుపు రంగు వాహనాలు, బుధ, ఆదివారాల్లో మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.

 

 

ఆదివారం మాత్రం రెండు రంగుల వాహనాలు రోడ్లపైకి వస్తాయన్నమాట. ఆ రోజుల్లోనే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రి తీసుకోవాలని సేలం డిప్యూటీ కమిషనర్‌ సెంథిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.. ఒకవేళ అధికారుల ఆజ్ఞలను కాదని ఎప్పుడుపడితే అప్పుడు బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో రెండు వాహనాలున్న వారు నాలుగు రోజులు తిరిగే అవకాశమున్నందున పోలీసులు ఆ దిశలో కూడా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

 

 

ఇకపోతే పోలీసులు చేసిన మార్కింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటారని, ఎవరైనా సొంతంగా మార్కింగ్‌ చేయడం.. లేదా దిద్దడం లాంటి పనులు చేస్తే వారిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. చూసారా వారి ఐడియా.. ఇలాంటిదే మన నగరంలో కూడా అమలు చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా.. కరోనా వ్యాపించకుండా ఆపాలంటే ఇలాంటి టెక్నిక్‌లే వాడాలి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: