ప్రస్తుతం ప్రపంచం మొత్తం చైనా విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా భారత్ చైనా విషయంలో చాలా సీరియస్ గా ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అది ఎందుకు అంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనా ఒక కారణం కాగా మరొకటి కరోనా వైరస్ ప్రచారం చేస్తోందని ఆ విషయంలో టిక్ టాక్ యాప్ సహకారం అందిస్తుందని చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిమంది టిక్ టాక్ లో కరోనా వైరస్ ని వ్యాప్తి ఎక్కువ చేయాలని కొందరు సూచిస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉండడమే కాకుండా యాప్ ని కట్టడి చేయాలని చెప్పి వారు కోరుతున్నారు.

 

 

అయితే ఇది ఇలా ఉండగా భారతదేశానికి టిక్ టాక్ సంస్థ వంద కోట్ల భారీ సహాయాన్ని అందించింది. ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రకటనలు మాత్రం అదుపు చేయడంలో ఎటువంటి సహకారం అందించలేదు. దీనితో ఈ విషయంలో చైనా కుట్ర ఉందని ఉద్దేశం చాలామందిలో అభిప్రాయపడుతోంది. దీంతో చాలామంది కేంద్రానికి తగు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం టిక్ టాక్ ని కొద్దిరోజులు మనదేశంలో బ్యాన్ చేయాలని చాలామంది సూచిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర సమాచార శాఖ కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు.

 


అలాగే చైనాకు చెందిన జూమ్ యాప్ విషయంలో కూడా కేంద్రం చాలా ఆగ్రహంగా ఉంది. ఈ యాప్ ఉపయోగించి అనేకమంది ఒకటేసారి వీడియో చాటింగ్ లోకి రావచ్చు. అయితే ఈ యాప్ వారి సమాచారాన్ని తస్కరిస్తోందని ఆ యాప్ వాడే వారి మొత్తం డేటాని చైనా చేతుల్లో పడుతుందని వాపోతున్నారు. దీని కోసం ప్రస్తుతం కేంద్ర సర్కార్ ఈ రెండు యాప్ ల ను పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. ఈ విషయం కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అతి త్వరలో వీటి విషయం పై ఒక క్లారిటీ తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై కేంద్ర సమాచార శాఖతో పూర్తి సమాచారం గురించి చర్చిస్తున్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: