తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. కరోనా కు  సంబంధించిన వార్తలతో నిత్యం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వాలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలతోపాటు, ప్రజల్లో ధైర్యం నింపే విధంగా నాయకుల వ్యవహారం ఉండాలి. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. కొద్దిరోజులుగా ప్రజల్లో తిరుగుతూ వారి సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తీవ్రంగా ఉన్న కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

 

IHG


అలాగే కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా  కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లోనూ అదేవిధంగా  మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ, ప్రజలకు ధైర్యం చెబుతూనే, అధికారులను సమన్వయం చేసుకుంటూ వారికి తగిన ఆదేశాలు ఇస్తూ హడావుడి చేస్తున్నారు. అయితే కేటీఆర్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన రేగుతోంది. కేటీఆర్ అంత రిస్క్ చేసి మరి ఆ ఏరియాలో పర్యటించడం నిజంగా కేటీఆర్ సాహసం చేస్తున్నారనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 



 త్వరలో తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతూ, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకునే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఈ విధంగా ప్రజల్లో తిరుగుతుండడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తోంది.అలాగే కేటీఆర్ బాటలో నడిచేందుకు మిగతా మంత్రులంతా ఉత్సాహం చూపిస్తున్నారట. ఏది ఏమైనా కేటీఆర్ ఇలా రిస్క్ చేస్తూ పర్యటించడం టిఆర్ఎస్ కు మైలేజ్ ఇచ్చే అంశంగా కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: