భరత రాజధాని న్యూ ఢిల్లీ లో విద్య ఓ వ్యాపారంగా జరుగుతున్న విషయం తెలిసిందే .అయితే పలు ప్రయివేట్ స్కూల్స్ ఫీజులను విపరీతంగా పెంచేశాయి. కొన్ని స్కూల్స్ ఆన్లైన్ విద్యను ఫీజుచెల్లించని కారణంగా ఆపేశాయి. అదేవిధంగా వివిధ రకాలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయి . ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తరపున శుక్రవారం రోజున ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఓ ప్రకటన చేశారు. కరోనా కారణంగా లాక్ డౌన్ పొడిగిస్తున్న నేపథ్యంలో స్కూల్ ఫీజుల గురించి అయన ప్రత్యేక ప్రకటన చేశారు .

 

ఢిల్లీ లోని ప్రయివేట్ పాఠశాలలు లాక్ డౌన్ సమయంలో కేవలం ఒకనెలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలనీ చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్స్ ఏమి వ్యాపార సంస్థలు కాదని ,వీటిని ప్రయివేట్ సంస్థలు నడుపుతున్నాయని. ఇకమీదట ఆలా జరగ కూడని చెప్పారు. ఫీజులు చెల్లించని కారణంగా వారు ఆన్ లైన్ క్లాసులు నిలిపివేశాయని తనవద్దకు కంప్లైంట్స్ వచ్చాయని సిసోడియా నిర్ణయాన్ని ప్రకటించే ముందు చెప్పారు.

 


'రాజధానిలోని ఏ ప్రైవేట్ పాఠశాలకు ఫీజు పెంచడానికి అనుమతి లేదని ప్రభుత్వం నిర్ణయించింది మరియు మూడు నెలల ప్రాతిపదికన వసూలు చేయడానికి వారిని అనుమతించరు. వారు ఒక నెల మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేస్తారు మరియు రవాణా వంటి ఇతర హెడ్ల కింద రుసుము వసూలు చేయబడదు”అని సిసోడియా చెప్పారు.అంతే కాకుండా నిబంధనలను పాటించని స్కూల్స్ కి విపత్తు నిర్వహణ చట్టముక్రింద శిక్షార్హులు అవుతారని మంత్రి తెలియా జేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: