ఫిబ్రవరి మొదటివారం నుంచి అమెరికాలో ప్రతాపం చూపడం మొదలుపెట్టిన కరోనా వైరస్ భూతం ఇప్పటివరకు వేలమంది ప్రాణాలను బలి తీసుకుంది. కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వరస దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. అమెరికాలో ఈ వైరస్ కరాళనృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది ఈ వైరస్‌ ధాటికి బలయ్యారు. అమెరికాలో కరోనా పరిస్థితులపై విశ్వసనీయ సమాచారం అందిస్తున్న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 30,990 మంది మరణించారు. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలకు సమీపంలో ఉంది. 

 

కాగా.. న్యూయార్క్‌ నగర యంత్రాంగం కూడా ఈవారంలో 3,778 అనుమానిత కేసుల్ని కరోనా మృతులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 6,75,243కు పెరగడంతో గత రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 22,170 కరోనా మరణాలతో ఇటలీ రెండో స్థానం.. 19,516 స్పెయిన్‌ మూడు, 17,920 ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో నిలిచాయి.

 

ఇంతటి విషాదంలో కూడా ఓ తండ్రి చేసిన పనికి సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఓ చిన్నారి పుట్టిన రోజుకు ఎవరూ రారనుకొని తెగ బాధపడిపోతున్న సమయంలో ఆ తండ్రి పోలీసులకు రిక్వెస్ట్ చేయండతో అతని ఇంటి ముందు పుట్టినరోజు సమయానికి వాహనాలతో పోలీసులు సందడి చేశారు. ఇది చూసిన చిన్నారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: