త‌బ్లీగి జమాత్ ప్ర‌తినిధులు, కొంత‌మంది ముస్లిం ఆక‌తాయిల ఆగ‌డాల‌కు క‌ళ్లెం వేసే విధంగా ప్ర‌భుత్వాలు ముందుకు క‌దులుతున్నాయి. క‌రోనా వైర‌స్ సోకిన కొంత‌మంది త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధులు, వారి ద్వారా సోకిన మ‌రికొంత‌మంది ముస్లింలు పెద్ద సంఖ్య‌లో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లు అన్ని రాష్ట్రాల్లో వంద‌లాది సంఖ్య‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, హైద‌రాబాద్‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల్లో మ‌ర్క‌జ్ లింకు ఉన్న కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. అయితే ఎంతో జాగుర‌క‌త‌తో వైద్యుల‌కు స‌హ‌క‌రిస్తూ వ్యాధి వ్యాప్తికి,నియంత్ర‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిన వీరు ఏకంగా ఐసోలేష‌న్ వార్డుల్లోనే వైద్య సిబ్బందిపై దాడుల‌కు దిగ‌బ‌డ్డారు. 

 

చాలాచోట్ల ఇప్ప‌టికి త‌రుచూ జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల గాంధీ ఆస్ప‌త్రిలో ఓ కరోనా పేషెంట్ బాత్రూంలో కాలు జారీప‌డి త‌ల‌కు గాయ‌మై చ‌నిపోయాడు. అయితే త‌మ అన్న చావుకు డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ మృతుడి బంధువులు వైద్యుల‌పై దాడుల‌కు దిగారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న డాక్ట‌ర్ల సంఘం వైద్యం చేయ‌డానికి నిస్స‌హాయ‌త‌ను వ్య‌క్తం చేసింది. ఇలాంటి స‌మ‌యంలో వైద్య సేవ‌లకు ఆటంకం క‌లిగితే మ‌రీ ప్ర‌మాదమ‌ని భావించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఆక‌తాయిల ఆట‌క‌ట్టించేందుకు పూనుకుంది. అందులో భాగంగానే ఓ చ‌ట్టం తీసుకురావ‌డ‌మేకాక గాంధీలో వైద్యుల‌పై దాడికి పాల్ప‌డిన నిందితుల‌ను అరెస్టు చేసింది. 

 

అరెస్టు చేసిన వారిలో ఒకరికి క‌రోనా పాజిటివ్ ఉండ‌టంతో ఆయ‌న్నుఅరెస్టు చేసి ఐసోలేష‌న్ వార్డులోనే ఉంచారు. ఆ త‌ర్వాత జైలుకు పంపుతార‌ని తెలుస్తోంది. ఇక త‌మిళ‌నాడు వైద్యుడిపై ఉమ్మివేసిన త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధి కూడా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇక ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ అరెస్టులు మొద‌ల‌య్యాయి. ఆరోగ్య స‌ర్వేకు వెళ్లిన వారిపై దాడులు చేయ‌డాన్ని కూడా ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. వైద్యం చేస్తున్న న‌ర్సుల‌తో వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం, వారిని ముట్టుకుంటామంటూ బెదిరింపుల‌కు దిగ‌డం చేస్తుండ‌టం తెలిసిందే. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: