భారతదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ చాప కింద నీరులా రోజు రోజుకి అమాంతం పెరిగి పోతుంది. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రావట్లేదు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి రోజు రోజుకి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు దారుడికి పదిహేను వందల రూపాయలు ఇస్తూ రేషన్ ని అందజేస్తున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒక రేషన్ కార్డుకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అలాగే రేషన్ ని అందజేస్తున్నారు.

 

 

అసలు విషయానికి వస్తే ... భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించని విధంగా కరోనా వైరస్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపి దేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరీక్షలు సరిగా లేకపోయినప్పటికీ కార్డుదారులకు బియ్యం కందిపప్పు అలాగే వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామని ఆయన తెలిపారు.

 


అలాగే రెండో విడత ఉచిత సరఫరా పంపిణీ కూడా ప్రారంభించాము అని ఆయన మీడియాకు తెలిపారు. అలాగే రక్త నిల్వలు పెంచుకోవడానికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అంటూ మోపిదేవి కొనియాడారు. అయితే నేడు దక్షిణ కొరియా నుంచి కరోనా కిట్స్ రావడంతో కేవలం 10 నిమిషాల్లో కరోనా నిర్ధారణ జరుగుతుందని అర్థమవుతుంది.

 


ప్రస్తుతం తెలంగాణలో 700 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 500 కేసులకు పైగా నమోదయ్యాయి. సదరు జిల్లాల కేసులను ఆయా జిల్లాల క్వారైంటెన్ కేంద్రానికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కరోనా నిర్ధారణ కిట్స్ రావడంతో పరీక్షలు ఎక్కువగా చేస్తే కరోనా కేసులు పెరిగే సూచనలు ఉన్నాయి. అది ఏమైనా పేదలకు మీ వంతు సహకారం అందించి వారికి సహకారం అందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: