దేశంలో కరోనా ఎప్పుడు మొదలైందో కానీ.. ప్రతిరోజూ దీనిపై రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి. లక్షకు పైగా మరణాలు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  దేశలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వలస కార్మికులు, కూలీల   జీవనోపాధికి సంబంధించి సర్వేను టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ భాగస్వామ్యంతో చేస్తున్నట్లు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు.

 

జవహర్‌నగర్‌ పరిధిలోని శాంతినగర్‌లో సర్వే మొదలైందని, కమిషనరేట్‌ ప్రాం తంలో దాదాపు 28వేల మంది కార్మికులు ఉన్నారన్నారు. దాదాపు 150 మంది కార్మిక కుటుంబాల జీవన స్థితిగతులను అంచనా వేశామన్నారు. ఏదైన సేవలు పొందాలంటే రాచకొండ కోవిడ్‌ కంట్రోల్‌ 9490617234కు ఫోన్‌ చేసి సంప్రదించాలన్నారు. 

 

కరోనాపై చేస్తున్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడుతూ నగరంలోని 10 స్కూళ్లకు చెందిన 950 మంది విద్యార్థులు గ్రీటింగ్‌ కార్డులను తయారు చేసి  అబిడ్స్‌ జీపీఓ సర్కిల్‌లో ప్రదర్శనకు పెట్టా రు. వీటిని పరిశీలించిన హైదరాబా ద్‌ సీపీ అంజనీకుమార్‌ విద్యార్థులు తమపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: