ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో దాదాపు హైదరాబాదులోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం 539 యాక్టివ్ పాజిటివ్ కేసులు నమోదవగా... 240 మంది బాధితులు ghmc లోనే ఉన్నారు. ఈ తరుణంలోనే హైదరాబాదులో పెద్ద ఎత్తున కరోనా బాధితులు ఉండటంతో తెలంగాణ హైకోర్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. 

 


అంతేకాకుండా నగరంలో రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉంటే పరీక్షలు ఎన్ని నిర్వహిస్తున్నారు.. ఎన్ని కొత్త కేసులుగా గ్రహిస్తున్నారు అని హైకోర్టు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్ కోట్లు ఉన్నాయని తెలపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 67 వేల టెస్టింగ్ కిట్లు ఉన్నట్లు నివేదికలో తెలియజేయడం జరిగింది... ఇలాంటి తరుణంలో పెద్ద సంఖ్యలో ఉన్న కరోనా హాట్ స్పాట్ లో ఎలా పరీక్షలు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై 24 లోపు సమగ్ర నివేదిక అందచేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించారు.

 


ఇక తాజాగా సూర్యాపేట జిల్లాలో అయిదుగురికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అవ్వడం జరిగింది. గత రెండు రోజులుగా సూర్యాపేట జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు ఆ జిల్లా నుంచి 44 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా విషయానికి వస్తే ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 19 అయ్యింది. దీనితో తెలంగాణలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 743 అయ్యింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 186 మంది కోలుకున్నారు. హైదరాబాద్ పరిధిలో 246 కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక కరోనా మహమ్మారిని అరికట్టడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: