ఏపీలో రాజకీయాల తీరే వేరు.. ఇక్కడ ఎలాంటి కష్ట కాలంలో అయినా రాజకీయాలకే ప్రాధన్యం ఉంటుందని అంటారు. అయితే ఓ విషయంలో మాత్రం జగన్ చేసిన ఓ పనిని తాజాగా తెలుగు దేశం మెచ్చుకుంది.. శభాష్ జగన్ అంటోంది. ఇంతకీ ఏంటా పని అంటారా..? రాష్ట్రాన్ని కరోనా వైరస్ కమ్మేస్తున్న నేపథ్యంలో మాస్కులు అత్యవసం అయ్యాయి.

 

 

ఈ మాస్కుల తయారీ బాధ్యతను జగన్ సర్కారు డ్వాక్రా సంఘాలకు అప్పగించింది.

ప్రతీ మనిషికి మూడు చొప్పున.. తొలుత హాట్‌స్పాట్లలో మాస్కులను పంపిణీ చేయాలన్నారు. జగన్ చేసిన ఈ పనిని తెలుగు దేశం మెచ్చుకుంటోంది. ఈ మేరకు జగన్ కు ఓ లేఖ రాసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు.. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇలా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు దేశం స్వాగతించడం ఇటీవలి కాలంలో బహుశా ఇదే మొదటిసారి కావడం విశేషం.

 

 

అయితే దీన్ని కూడా టీడీపీ నాయకులు తమ ఖాతాలోనే వేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలో స్వయం శక్తి సంఘాలకు చంద్రబాబు రుణాలు ఇప్పించి కుట్టు మెషీన్లు వంటి సామగ్రి అందించారని.. ఇప్పుడు ఆ సామగ్రి ఉండటం వల్లే మహిళా సంఘాలు త్వరగా మాస్కులు కుట్టగలుగుతున్నారని కళా వెంకట్రావు తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రమే పాజిటివ్ గా స్పందించి.. మిగిలిన విషయాల్లో జగన్ సర్కారు విఫలమైందంటూ ఎప్పటిలాగానే రాసుకొచ్చారు.

 

 

ఏదేమైనా ఇలాంటి కరోనా పాజిటివ్ కాలంలో పాజిటివ్ పాలిటిక్స్ కూడా ఇప్పుడు చాలా అవసరం. ఏదైనా ఓ వైపు తన బాసు హైదరాబాద్ లో కూర్చుని వైసీపీ సర్కారు తీరును ఎండగడుతుంటే.. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం కనీసం ఈ ఒక్క విషయంలోనైనా పాజిటివ్ గా స్పందించడం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: