ఏపీలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా వందల్లోకి వెళ్లిపోతోంది. టెస్టులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఈ సమయంలో ఎక్కువగా పాజిటివ్ కేసులు వస్తున్న ప్రాంతాలపై అధికారులు, జిల్లా యంత్రాంగాలు ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం జగన్ సూచిస్తున్నారు. కరోనా వైరస్ ను నిరోదించడానికి భౌతిక దూరం పాటించాలని, ఇందుకు సంబందించిన నిబందనలను కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

 

 

 

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ గా ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలని ఆయన అదికారులకు సూచించారు. మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. క్వారంటైన్‌లో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టాలని సూచించారు. అదే విధంగా వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు బీదలకు రూ. 2వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు.

 

 

ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాలు, గుడ్డు, కూరగాయలు తదితర పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచనలు చేయాలని జగన్ అధికారులకు చెబుతున్నారు. లేదంటే.. మళ్లీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుందని జగన్ హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా వారిని మనం క్వారంటైన్‌లో పెడుతున్నాం. ఒకేసారి మనం ఇంటికి పంపితే... పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు. అందుకే తిరిగి ఇంటికి పంపించినప్పుడు రూ. 2వేల డబ్బు చేతిలో పెట్టాలి అని జగన్ అధికారుకు చెబుతున్నారు.

 

 

ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికార యంత్రాగం ఆ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. రెడ్ జోన్లలో ఇంటికే నిత్యావసరాలు పంపించే ఏర్పాట్లు చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: