తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు వల్లభనేని వంశీ. 2004వ సంవత్సరం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... అదేవిధంగా విభజన జరిగిన తర్వాత కూడా రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడిగా వల్లభనేని వంశీ వరుసగా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి విజయాన్ని సాధిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. విభజన జరిగిన తర్వాత కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో మొదటిలో చురుకుగానే ఉండటం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన టిడిపి అధికారంలోకి రాలేదు. దీంతో జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు వల్లభనేని వంశీ మధ్య పొసగకపోవడంతో టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది.

 

కానీ తెలుగుదేశం పార్టీ వంశీ రాజీనామాను ఇంతవరకు ఆమోదించలేదు. ఇదే సమయంలో వైసీపీ మద్దతుదారుగా అసెంబ్లీలో  జగన్ ప్రభుత్వానికి జై కొట్టడం జరిగింది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బహిరంగ మీడియా సమావేశాల్లో అయితే చంద్రబాబుని అదేవిధంగా నారా లోకేష్ ని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. పార్టీలో నారా లోకేష్ ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం కష్టమని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 

ఇటువంటి టైమ్ లో ఇటీవల సోషల్ మీడియాలో పథ్నాలుగు సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో తన కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటూ వల్లభనేని వంశీ ఫేస్ బుక్ పోస్టింగ్ రాజకీయంగా కలకలం రేపింది. వల్లభనేని వంశీ ఇంక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే అని భావిస్తున్నారు. అయితే ఈ పోస్టు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వంశీ పెట్టాడని త్వరలోనే ..తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి డైరెక్ట్ వైసిపి పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి సంచలన స్కెచ్ తో రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: