ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వైద్యుల స‌ల‌హా మేర‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. సౌత్ కొరియా నుంచి రాష్ట్రానికి దిగుమ‌తి చేసుకున్న కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా సీఎంకు వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పరీక్షల్లో సీఎంకు కరోనా నెగెటివ్ వచ్చింద‌ని వైద్యాధికారులు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలను వేగవంతం చేసేందుకు కంకణం కట్టుకున్న ఏపీ సర్కార్.. లక్ష ర్యాపిడ్ కిట్ల‌ను ద‌క్షిణ కొరియా నుంచి ఆర్డ‌ర్లిచ్చి తెప్పించిన విష‌యం తెలిసిందే. 

 

 

సియోల్ ప‌ట్ట‌ణం నుంచి  నుంచి ప్రత్యేక చార్జర్ విమానం ద్వారా శుక్రవారం ఆ ర్యాపిడ్ కిట్లు ఏపీకి చేరుకున్నాయి. ఈసంద‌ర్బంగా ప‌రీక్ష‌ల‌ను ఈ కిట్ల ద్వారా ప్రారంభించేందుకు ముందుగా  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త‌న‌కే చేయించుకున్నారు.  ఈ కిట్ల ద్వారా కేవ‌లం ప‌ది నిముషాల్లోనే కరోనా ఫలితం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.  ఏపీలో రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో రేపటి నుంచి మరింత వేగంగా పరీక్షలు జరగనున్నా యి. రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ప‌రీక్ష‌లు జ‌రిపే విధానంపై ఇప్ప‌టికే వైద్య ఆరోగ్య సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చారు. 

 

ఈ కిట్ల ద్వారా అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ పరీక్షలను వేగవంతం చేయాలని ప్ర‌భుత్వం సూచించింది.  ఇప్ప‌టికీ చాలా కంటోన్మెంట్ల‌లో త‌రుచూ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉంది. ఇక  ముందస్తు ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌లి  కాలంలో ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రిని పలువురు ప్రశంసించ‌డం గ‌మ‌నార్హం. ప‌లు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు కూడా ఏపీలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శంసిస్తూ క‌థ‌నాలు ప్ర‌చురించాయి.

 


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: