ఒక పక్క కరోనా వైరస్ తో దేశం మొత్తం అల్లకల్లోలం,మరో పక్క లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో ఎక్కడ  పనులు అక్కడ ఆగిపోయాయి. కానీ దొంగలు మాత్రం వాళ్ళ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. ఎక్కడికెక్కడ పోలీసులు పహారా కాస్తుంటే వాళ్ళ కళ్ళు కప్పి మరి దొంగతనం చేసారు.ఇంతకీ ఏమి ఎత్తుకుని వెళ్లారో తెలిస్తే మీరే షాక్ లో ఉంటారు.

 

ఏ బంగారమే, డబ్బో, వజ్రలో కాదండోయ్.ఒక కారు టైర్లు ఎత్తుకుని పోయారు.. కారు మాత్రం అక్కడే ఉంది. అసలు వివరాలలోకి వెళితే... సంగారెడ్డి కలెక్టరేట్‌లో రెవిన్యూ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రోజూ కారులో ఆఫీసుకు వస్తుంటారు.అయితే  ఆయన నివసించే ప్రాంతాన్ని ఇటీవల కరోనా రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించడం అయన విధులకు హాజరు కావడంలేదు.  కారును కలెక్టరేట్‌లోని పార్కింగ్ ఏరియాలోనే కొద్దిరోజులుగా ఉంచుతున్నారు.

 

రెండ్రోజులు విధులకు హాజరుకావడం లేదు. అయితే గురువారం  కలెక్టరేట్‌కి వచ్చారు. కారు దగ్గరికి వెళ్లి చూడగా దానికున్న నాలుగు టైర్లు కనిపించలేదు. దీంతో షాకైన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉండే సీసీ కెమెరాలను పరిశీలించారు.నిత్యం పోలీసు పహారా ఉండే కలెక్టరేట్‌లో దొంగతనం జరగటం  సంగారెడ్డిలో  అందరిని కలకలానికి గురిచేసింది. పోలీసులు వివిధ కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

కలక్టరేట్ ఆఫీస్ లో నిత్యం పోలీసులు కాపలా కాస్తారు అని తెలిసిన దొంగలు పడ్డారు. అనుమానించాలిసిన విషయం ఏంటంటే  ఎత్తుకుపోయేవాళ్లు కార్ ని వదిలేసి టైర్లు తీసుకువెళ్లడం. అసలు కారు టైర్లను దొంగలే ఎత్తుకెళ్లారా లేక తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేసారా అని అనుమానిస్తున్నారు.ఒకవైపు కరోనాతో కంగారు పడుతుంటే దొంగలు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారుగా.. !

మరింత సమాచారం తెలుసుకోండి: