కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ప్రధాని మోడీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి గురించి అనేక విషయాలు మోడీకి చెప్పటం జరిగింది. రాష్ట్రంలో రెడ్, గ్రీన్ అదేవిధంగా ఆరెంజ్ జోన్లు గా విభజించినట్లు మోడీకి తెలపడం జరిగింది. ఈ సమయంలో కర్నూలు మరియు నెల్లూరు  జిల్లాలను రెడ్‌జోన్లుగా చూపించడం జరిగింది. రెండు జిల్లాలో 20 కి పైగా కేసులు నమోదయ్యాయని మాత్రమే చెబుతూ రెడ్‌ జోన్‌లో చూపించారు.

 

అప్పటికే లాక్‌డౌన్‌ ను.. రెడ్ జోన్లకు పరిమితం చేస్తారన్న ప్రచారం జరగడంతో.. సీఎం జగన్.. మండలాల వారీగా రెడ్ జోన్లను ప్రకటించారు. ఏపీలో 676 మండలాలకుగాను 37 మండలాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయన్నారు. 44 ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని… 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం ప్రతి జిల్లాను యూనిట్ గా తీసుకుని ఇటీవల రెడ్, గ్రీన్, ఆరెంజ్ గా విభజించి హాట్ స్పాట్ లుగా గుర్తించడం జరిగింది.

 

దీంతో జగన్ ఇచ్చిన మండలాల జోన్‌ ఐడియా నీ మోడీకి నచ్చలేదు అని అర్థమవుతుంది. ఇతర కారణాలు ఏమీ లేకపోయినా జగన్ ఇచ్చిన మండలాల జోన్లు పరిగణలోకి తీసుకోకుండా...దేశంలో జిల్లాలో ఏ మండలం లో నైనా అత్యధిక కేసుల్లో అంటే సదరు జిల్లా మొత్తాన్ని రెడ్ జోన్లుగా ఇటీవల కేంద్రం ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఏపీలో కేంద్రం దాదాపుగా 80 శాతం హాట్ స్పాట్ గా గుర్తించినట్లు అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: