కరోనా వైరస్ తో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం పోరాడుతోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అదే సమయంలో మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికా కరోనా వైరస్ ఎదుర్కొనడంలో  చాలావరకు విఫలమయింది. ఇటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైరస్ ఈ విధంగా విస్తరించడానికి కారణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు చైనా అని ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

 

ఇదే టైములో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి అమెరికా నుండి వెళ్లాల్సిన నిధులను కూడా ట్రంప్ ఆపేయటం జరిగింది. దీంతో జర్మనీ మరియు పలు దేశాలు ట్రంప్ నిధులు ఆపేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇలాంటి సమయంలో ఈ విధంగా వ్యవహరించడం తప్పు అంటూ అంతర్జాతీయ మీడియా ముందు అమెరికా పై మండిపడుతున్నారు. ఇదే సమయంలో అసలు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఖచ్చితమైన డేటాని ఇస్తుందని నిజాయితీగా  వెల్లడిస్తుంది అని కానీ చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా లాంటి చాలా దేశాలు డేటాను బయటపెట్టడం లేదని తప్పుడు డేటాను ఇస్తున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు.

 

ఇలాంటి టైమ్ లో అమెరికా ని టార్గెట్ చేసి అంతర్జాతీయ మీడియా ముందు సూచనలు ఇస్తున్న దేశాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని డోనాల్డ్ ట్రంప్ అంటున్నారట. కావాలని అమెరికా ని టార్గెట్ చేస్తే వేరేగా ప్రతి స్పందించాల్సి వస్తుందని అంటున్నారట. దీంతో చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా, జర్మనీ ట్రంప్ ని కెలికి కెలికి యుద్ధం తెచ్చుకునేలా ఉన్నారే అని అంతర్జాతీయస్థాయిలో టాక్ వినపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: