కరోనా కట్టడి కోసం మే మూడవ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు . మే మూడవ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందని భావిస్తున్న వారికి, వచ్చే నెల 24  వతేదీ వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది . మే 23  వ తేదీన  ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ పండుగ ఉండడం తో, మే  24 వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలన్న డిమాండ్ విన్పిస్తోంది . ఏప్రిల్ 23 వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానుండడం తో ,  ఈ ఉపవాస దీక్షాకాలం లో  ముస్లింలంతా సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు .

 

పవిత్ర రంజాన్ మాసం లో సామూహిక ప్రార్ధనలు చేయకుండా ముస్లింలను  కట్టడి చేస్తే మతవిద్వేషాలు రగిలే ప్రమాదముందన్న  ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి . దానికితోడు రంజాన్ మాసం లో లభించే ప్రత్యేక వంటకాలను రుచి చూసేందుకు హోటళ్లకు , రెస్టారెంట్లకు జనాలు ఎగబడుతుంటారు . ప్రస్తుతం కరోనా విస్తృతి చెందుతోన్న సమయం లో లాక్ డౌన్ ఎత్తివేస్తే అటు పవిత్ర  ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లిం లను , ప్రత్యేక వంటకాలను రుచి చూసేందుకు ఎగబడే వారిని  కట్టడి చేయడం అంతాఆషామాషి  వ్యవహారం కాదని భావిస్తోన్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే ముస్లింలు సామాజిక దూరం  పాటించడమన్నది అసాద్యమని భావిస్తోన్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు , లాక్ డౌన్ పొడిగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది . అయితే రంజాన్ పవిత్ర మాసం లో ఇంట్లోనే ఉండి ఉపవాసాలు చేయాలని ముస్లిం  మతపెద్దలు  ఇప్పటికే చెబుతున్నారు . రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమయితే కానీ ముస్లిం లు ఎంతవరకు సామాజిక దూరం పాటిస్తారన్నది తేలనుంది .   

మరింత సమాచారం తెలుసుకోండి: