మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడి పెళ్లి వేడుకలో అతిథులు లాక్‌డౌన్ నిబంధనలను తుంగ‌లో తొక్కారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోల్లో అతిథులు మాస్కులు లేకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా కనిపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ వివాహం జ‌రిగిన తీరుపై నెటిజ‌న్లు, దేశ ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఛీ-ఛీ: లాఠీలు పేదలకు - రాచమర్యాదలు నాయకులకా ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. జనతా దళ్(సెక్యులర్)  నేత హెచ్‌డి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి.. కాంగ్రెస్ నేత ఎం కృష్ణప్ప మనవరాలు రేవతిని శుక్రవారం వివాహమాడారు. అయితే వీరి పెళ్లికి లాక్‌డౌన్ ప్రకటించకముందే ముహూర్తాలు పెట్టుకున్నారు. రామానగర జిల్లాలోని జనపద లోకా సమీపంలో 92 ఎకరాల విస్తీర్ణంలో  వైభవంగా పెళ్లి చేయాల‌ని భావించారు. 

 

 

అయితే ఊహించ‌ని విధంగా లాక్‌డౌన్ అంశం తెర‌పైకి రావ‌డంతో ఇరు కుటుంబాల స‌భ్యులు పెళ్లి నిర్వ‌హ‌ణ‌పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. అయితే చివ‌రికి కొంత‌మంది బంధువుల మ‌ధ్య ముందు అనుకున్న ముహూర్తానికే వివాహం జ‌రిపించాల‌ని అనుకున్నారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ప్లేస్‌ను కుమారస్వామి నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి మార్చుకున్నారు. పెళ్లిని సాదాసీదా..అతికొద్దిమ‌ధ్య బంధువుల మ‌ధ్య నిర్వ‌హిస్తున్న‌ట్లు కుమార‌స్వామి ప్ర‌క‌ట‌న చేశారు.కేవలం 60 నుంచి 70 మంది బంధువులు మాత్రమే ఉంటారని కూడా త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా...పెళ్లికి వ‌చ్చిన వారిలో ఎవ‌రూ కూడా సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 


దేశ‌మంతా ఎంతో దీక్ష‌తో లాక్‌డౌన్ అమ‌లుకు స్వీయం నిర్బంధం పాటిస్తుంటే దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ప‌నిచేసిన దేవ‌గౌడ ఇంటిలో శుభ‌కార్యం ఇలా జ‌ర‌గ‌డంపై మేధావులు సైతం మండిప‌డుతున్నారు. అతిథులెవ‌రూ మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డంపై మండిప‌డుతున్నారు. నిబంధ‌న‌లు సామాన్యుల‌కేనా...పెద్ద‌ల‌కు ప‌ట్ట‌వా అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.  వివాహానికి 42వాహనాలకు, 120 మందికి పాస్‌లు ఇచ్చినట్టు కర్ణాటక పోలీసులు చెబుతున్నా...పెళ్లికి వ‌చ్చిన వారి సంఖ్య వంద‌ల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం.  ఇదిలా ఉండ‌గా కుమారస్వామిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజ‌కీయ రంగును పులుముకుంటున్నాయి. చూడాలి ఏం జ‌రుగుతుందో  కర్ణాట‌క‌లో.

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: