ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే విధంగా విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న రాష్ట్రంలోనూ గంటా శ్రీనివాసరావు రాజకీయాలలో కీలకంగా రాణిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ చాలా బలంగా ఉంటుందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటారు. రాజకీయాలను చాణక్యం గా చాలా సైలెంట్ గా ప్రత్యర్థులకు కూడా మతిపోయే విధంగా చేయడంలో గంటా ని మించిన వారు ఉండరని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు...జగన్ ఇలాకా కడప జిల్లాలోనే ఒక ఎలక్షన్ లో...వైసిపి పార్టీ నేతలు అందరిని గుర్తుచేసే విధంగా ఓడించే లా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జరిగింది.

 

 

కడప జిల్లాలో గంటా శ్రీనివాసరావు ఎంటర్ అయిన తర్వాత జిల్లా రాజకీయం మొత్తం మారిపోయి టీడీపీకి ఫేవర్ అయ్యింది. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో...చాలావరకు గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయిపోయారు. మొదటిలో వైసీపీ లోకి వెళ్దాం అనుకుంటున్నా దారులను మూసేసారు జగన్. అయితే ఇటీవల కరోనా వైరస్ రాకముందు స్థానిక ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులను అరెస్టు చేసి విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ ఖాతాలో వేయాలని..చురుగ్గా మెలిగారు.

 

 

కాగా ఈ లోపు కరోనా వైరస్ రాకతో సందిగ్దం లోకి వెళ్ళిపోయారు. అయితే కరోనా వైరస్ తగ్గిన వెంటనే...విశాఖపట్టణంలో అధికార పార్టీ వైసీపీ కరోనా వైరస్ కట్టడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ తరఫున భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు దూకుడుగా రాజకీయాలు చేయడానికి సందిగ్ధం నుండి బయటకు రావడానికి గంటా శ్రీనివాస్ రెడీ అవుతున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: