భారతదేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కేరళ రెండో స్థానంలో ఉంది. కాగా రికవరీ విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. మొదటిలో కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో కేరళలో పాజిటివ్ కేసులు వరుసగా నమోదవడంతో దేశం మొత్తం భయబ్రాంతులకు గురి అయ్యింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఉత్తరాదిలో కూడా పాజిటివ్ కేసులు రావడంతో...ఇక వెంటనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దాదాపు మొదటి ఇరవై ఒక్క రోజు అనుకున్న ఇటీవల మోడీ 19 రోజులు లాక్ డౌన్ పొడిగించడం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ తరుణంలో ఏప్రిల్ 20 తర్వాత షరతులతో సడలింపులు కలిగిన లాక్ డౌన్ ఉంటుందని మోడీ ఆ సమయంలో తెలపడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సడలింపు నిర్ణయాలకు అనుగుణంగా...కేరళ ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత రోడ్లపై వాహనాలను కొన్ని పరిమితులతో అనుమతించడానికి రెడీ అయినట్లు ముఖ్యమంత్రి విజయాన్ని తెలిపారు. బేసి- సరి విధానంలో వాహనాలను రోడ్లపైకి రావడానికి ప్రతిపాదన సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా ,కరోనా ప్రభావం ఉన్న జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించేందుకు కేంద్రం అనుమతిని కోరింది. కాసర్‌గడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలను ఒక జోన్‌గా పరిగణిస్తూ.. అక్కడ మే 3 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు సి.ఎమ్. తెలిపారు.

 

రెండో జోన్‌లో పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలు ఉంటాయని.. అక్కడ హాట్‌స్పాట్‌ జోన్లను సీల్‌ చేయనున్నట్లు సీఎం విజయన్‌ పేర్కొన్నారు. అదే విధంగా అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్‌, త్రిసూర్‌, వయనాడ్‌ జిల్లాలను మూడో జోన్‌గా పరిగణిస్తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఆయా జిల్లాల్లో పాక్షికంగా సడలించనున్నట్లు తెలిపారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు కోవిడ్‌-19 కేసులు లేని జిల్లాలని.. అవి నాలుగో జోన్‌ కిందకు వస్తాయని పేర్కొన్నారు. తాజాగా కరోనా వైరస్ కట్టడి విషయంలో కేరళలో ఈ సరికొత్త రూల్స్ ముఖ్యమంత్రి ప్రకటించడంతో కేరళ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: