కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..

 

 

కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. తాజాగా ప్రముఖ నటుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ మరో  వీడియో ను పోస్ట్ చేశాడు. అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. 

 

 

 

కరోనా అంటే భయంకరమైన వ్యాధి అని చెప్పాలి.. ఈ కరోనా కారణంగా చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. అలాగే బంధాలను బాంధవ్యాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది..తాజాగా కరోనా సోకిన ఓ తెలుగు వ్యక్తిని అమెరికాలోనే అంత్యక్రియలు చేశారు.. అది కూడా గుండెల్ని పిండేసే సంఘటన అని చెప్పాలి.. తల్లి దండ్రులకు బిడ్డ చివరి చూపులను ఆన్లైన్ లో చూపించి మరి పుత్ర శోకాన్ని మిగిల్చారు.. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ మనసు గుండెల్ని పిండేస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: