ప్రపంచవ్యాప్తంగా 21,88,194 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,47,632 మంది మరణించారు. భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇందులో మృతులు 452, కోలుకున్నవారు 1766 మినహాయించగా ప్రస్తుతం 11,616 యాక్టివ్ కేసులున్నాయి

 

భారతదేశ ఆర్థిక రాజధాని రాజధాని ముంబయి కరోనా వైరస్ గుప్పిట చిక్కుకుని విలవిలలాడుతోంది. శుక్రవారం ముంబయిలో కొత్తగా 77 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ముంబయిలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,120, మరణాలు 121కి పెరిగాయి.

 

ఇటు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రువారం కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. గుంటూరు(126), కర్నూలు(126)జిల్లాలు టాప్‌లో ఉండగా…. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంకా ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం

 

నెల్లూరు జిల్లా -64

కృష్ణా జిల్లా -52

ప్రకాశం జిల్లా - 42

కడప జిల్లా - 37

చిత్తూరు జిల్లా - 28

పశ్చిమ గోదావరి జిల్లా - 34

తూర్పుగోదావరి జిల్లా - 17

విశాఖపట్నం జిల్లా -20

అనంతపురం జిల్లా -26

కర్నూలు జిల్లా -126

గుంటూరు -126

మొత్తం కేసులు -572

 

ఇదిలా ఉండగా.. తెలంగాణలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 766 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు. కేవలం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 286 కేసులు ఉండడం గమనార్హం.

 

జిల్లాలవారీగా సూర్యాపేట జిల్లాలో 44, నిజామాబాద్‌లో 42, వికారాబాద్‌లో 33, వరంగల్ అర్బన్‌లో 21 కేసులున్నాయి. హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: