విజ‌య‌వాడ‌లో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు చాలా భిన్నంగా మారిపోనున్న‌ట్లు నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ విస్తుగొలిపే అంచ‌నాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఎండ‌కాలంలోనే వాన‌కాలం ఉంటుంద‌ని,..వాన‌కాలంలో కూడా ఎండ‌వేడిమి, ఉక్క‌పోత ఉంటాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్ప‌టికిప్పుడు ఇది జ‌ర‌గ‌క‌పోయిన వ‌చ్చే 50ఏళ్ల‌లో జ‌రిగేది ఇదే అంటూ త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది. నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ  మెగా సిటీల్లో 2070 నాటికి రాబోయే వాతావరణ మార్పులపై ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. అందులో భాగంగానే ఆయా ప‌ట్ట‌ణాల భ‌విష్య‌త్ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను అంచ‌నావేస్తూ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. 


ఇక మ‌న విజ‌య‌వాడ ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరుగ‌తాని తెలిపింది. ప్రస్తుతం విజయవాడ... ఎరిడ్, హాట్ స్టెప్పీ జోన్‌ (పచ్చదనంతో)గా ఉంది. అయితే పెరుగుతున్న కాలుష్యం..త‌రుగుతున్న ప‌చ్చ‌ద‌నం వంటి కార‌ణాల‌తో భవిష్యత్తులో బెజవాడ... ట్రాపికల్ సవన్నా జోన్.. అంటే అత్యంత ఎండలున్న ప్రాంతంగా మారనుంద‌న్న మాట‌. ట్రాపికల్ సవన్నా జోన్లో ఏడాదిలో ఎక్కువ కాలం ఎండలే ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వర్షాలు పడే రోజుల్లో కూడా మార్పులు రానున్నాయని వెల్ల‌డిస్తున్నారు. దక్షిణ, ఉత్తర ధృవాలకు దగ్గరగా ఉండే... నగరాల్లో సీజన్లు మారతాయిగానీ... విజయవాడలో సీజన్లు మారిన ఫీలింగ్ కలగదని చెబుతున్నారు. 


విజయవాడలో  ఏడాదంతా వేడిగా, ఉక్కపోతతో ఉంటుందనీ, ప్రతీ నెలలో సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీల దాకా ఉంటుందని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఇదిలా ఉండ‌గా విజయవాడలో కొంచెం ఎండ పెరిగినా... దాని ప్రభావం అక్కడి నీటి లభ్యత, వ్యవసాయం, మౌలిక వసతులు వంటి ఇత‌ర రంగాల‌పైనా తీవ్ర‌మైన దుష్ప్ర‌భావం చూపుతుంద‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. అదే జ‌రిగితే ఇక విజ‌య‌వాడ ప‌ట్ట‌ణంలో భ‌విష్య‌త్ త‌రాల మ‌నుగ‌డ‌కు, జీవ‌నానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని ప‌ట్ట‌ణ‌వాసులు చెబుతున్నారు. దీని నివార‌ణ‌కు ఇప్ప‌టి నుంచే చ‌ర్య‌లు ఆరంభిస్తే ప్ర‌మాదాన్ని తొల‌గించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: