ఇప్పటి వరకు కరోనా బారిన ప‌డి ప్రపంచవ్యాప్తంగా 154,320 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి ఇక బాధితుల సంఖ్య 22.50 లక్షలు దాటేసింది. గ‌డిచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 9,400 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 5.72 లక్షల మంది కోలుకున్నారు. మరో 15 లక్షల మందిలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండగా, 57,130 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఇక అమెరికా, బ్రిట‌న్‌, ఇట‌లీ,స్పెయిన్‌, ఫ్రాన్స్ దేశాల్లో మ‌ర‌ణ మృందంగం కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా  అమెరికాలో కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని రీతిలో కల్లోలం సృష్టిస్తోంది.

 

 24 గంటల్లోనే 4,591 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నిమిషానికి కనీసం ముగ్గురు చొప్పున కరోనా దెబ్బకు అమెరికాలో బ‌ల‌వుతున్నారు. ఇదిలా ఉండగా  ఆఫ్రికాలో కరోనా వైరస్ కారణంగా కనీసం 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని యూఎన్ హెల్త్ ఏజెన్సీ ఓ నివేదిక వెలువరించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే 33 లక్షల మందికి పైగా మ‌ర‌ణించే ప్ర‌మాద‌ముంద‌ని డేంజ‌ర్ బెల్స్ మోగించింది. 120 కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆఫ్రికాపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ రూపొందించిన నివేదికలో పేర్కొంది. 

 

ఆఫ్రికాలో ప్రస్తుతం 18,000 కరోనా కేసుల నమోద‌య్యాయి. యూరప్ తరహాలో ఇక్కడ వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఎదురయ్యే నష్టాలను తట్టుకునే ఆర్థిక స్థితి ఆఫ్రికాలోని ఏ దేశానికీ లేదని, దాదాపు అన్ని దేశాలు కూడా రెండేళ్ల పాటు అప్పుల్లోనే కూరుకుపోయి ఉంటాయని ఐరాస నివేదిక పేర్కొంది. ఇక కరోనా మరణాలు, కేసుల విషయంలో వాస్తవాలను చైనా దాచిపెట్టిందని అంతర్జాతీయ సమాజం గుప్పిస్తున్న ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది. ఈ వైరస్‌ వెలుగుచూసిన వుహాన్‌ నగరంలో మృతులు, కేసుల లెక్కలను చైనా తాజాగా సవరించ‌డంతో ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: