కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలను పట్టి పీడిస్తుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారిలో ఒక లక్షా 50 వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే చనిపోయిన వారిలో ఆడ వారి కంటే ఎక్కువగా మగవారు ఉండటమే గమనార్హం. ఇలా మగవారు మాత్రమే ఎక్కువగా చనిపోవడానికి గల కారణాన్ని కెనడియన్ ఫిజీషియన్, వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ షరోన్‌ మోలెమ్‌ చాలా వివరంగా తెలిపారు. కోవిడ్ 19 వ్యాధిని నియంత్రించగల శక్తి మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా ఉంటుందని ఆయన వెల్లడించారు.


షరోన్‌ మోలెమ్‌ మాట్లాడుతూ... ' ఆడవారిలో రెండు X క్రోమోసోములు ఉంటాయి. కానీ మగవారిలో ఒక X క్రోమోజోమ్, ఒక Y క్రోమోజోమ్ ఉంటాయి. శరీరంలోని X క్రోమోసోములు అనేవి ఎక్కువ కాలం బతికేందుకు దోహదపడతాయి. అలాగే X క్రోమోజోములలో మెదడుకి కావలసిన జన్యువులు కూడా ఉంటాయి. కానీ మగవారిలో ఉండే Y క్రోమోజోములు ఎక్కువ కాలం బ్రతికేందుకు అసలు దోహదపడవు. సో, జీవశాస్త్రపరంగా చూస్తే మగవారు చాలా బలహీనులను అని తెలుస్తోంది' అని ఆయన అన్నారు. దక్షిణ కొరియా లాంటి దేశాలలో ఆడవారికి మాత్రమే కరోనా వైరస్ ఎక్కువగా సోకినప్పటికీ... చనిపోయిన వారిలో మాత్రం మగవారు ఎక్కువగా ఉన్నారు.


డాక్టర్ షరోన్‌ మోలెమ్‌ ఇంకా మాట్లాడుతూ... ' మగవారికి ఆడవారి కంటే ఎక్కువగా బలం ఉన్నా, శారీరకంగా దృఢంగా ఉన్నా కూడా... వారు ఎక్కువ కాలం బతుకుతారని అనుకోవడం పెద్ద పొరపాటే. కానీ మహిళలు శారీరకంగా కాస్త బలహీనంగా ఉన్నా వారిలో XX క్రోమోసోములు చాలాకాలం బ్రతికేందుకు ఉపయోగపడతాయి' అని ఆయన చెప్పుకొచ్చారు.


అలాగే పురుషులలో కంటే మహిళలలో ఎక్కువగా ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్రోజన్ బాడీ లో ఎక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి కూడా బాగా దృఢపడుతుంది. కానీ మగవారిలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ రోగనిరోధక శక్తిని బాగా తగ్గించేస్తుంది. అందుకే మగవారు రోగాల బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇప్పటివరకు క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిలో ఆడవారే ఎక్కువగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా పుట్టుకతోనే XX క్రోమోజోములు కలిగి వుండే ఆడవారికి ఎక్కువ కాలం బతికే సామర్థ్యం ఉంటుందని స్పష్టమవుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: