దేశంలో కరోనా తో సగటు మనిషి ఎన్ని కష్టాలు పడుతున్నారో చెప్పనలవి కాదు.  గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వాస్తవాని ఈ నెల 14 వరకు లాక్ డౌన్ ఉన్నా.. దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోతూనే ఉంది.. దాంతో మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు పీఎం మోదీ ఈ మద్య జాతినిఉద్దేశించి మాట్లాడారు. ఇక కరోనా కష్టాలు సామాన్యులకు మామూలుగా లేవు.  ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.

 

అక్కడ ఢిల్లీ జలమండలి ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసేది. లాక్‌డౌన్ సమయంలోనూ తాగేనీటి సరఫరా చేస్తున్పపటికీ ట్యాంకర్ల ఫ్రీక్వెన్సీ తగ్గించింది. అయితే వారు పంపుతున్న నీరు అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ బస్తీల ప్రజలు అధికారుల చుట్టూ తిరిగి అదనంగా ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు.

 

దీంతో ఎప్పుడో ఒకసారి వచ్చే దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఒక బిందె, రెండు బిందెల నీళ్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు.  ఆ మద్య ఢిల్లీ ముజాహిద్దిన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి నుంచి అధిక శాతం కరోనా వ్యాప్తి జరిగిందని అంటున్నారు. అయితే నీటి తిప్పలు చాలా రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: