ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు సైబర్ మోసగాళ్లు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో సైబర్ మోసాలు రోజురోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. వీటికి సంబంధించిన పోలీసు ఫిర్యాదులు కూడా అధికంగా నమోదు కావడం గమనార్హం. వీరు ముఖ్యంగా ఫోన్ చేసి బ్యాంకు సేవల అందిస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా రహ్మత్ నగర్ కు చెందిన ఒక యువకుడు గూగుల్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయగా.. ఆ ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు. ఈ విషయం గురించి తెలుసుకుందామని సేవా కేంద్రానికి ఫోన్ చేయడానికి గూగుల్లో వెతికాడు. 

 

 

ఒక వెబ్ సైట్ లో ఇచ్చిన నెంబర్ కు ఫోన్ కాల్ చేయగా వారు ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు .. డబ్బులు మీకు రిఫండ్ చేస్తామని చెప్పారు. ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పాలని అడగగా ఆ యువకుడు వారికి చెప్పగా బ్యాంకు ఖాతాలో ఉన్న 99 వేల రూపాయలు మటు మాయమయ్యాయి. ఇదే తరహాలో మెహదీపట్నంకి చెందిన ఒక వ్యక్తికి కూడా ఇలాగే జరిగి తన బ్యాంకు ఖాతాలో 79 వేల రూపాయలు పోవడం జరిగింది.

 

 

ఇక హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కు చెందిన ఒక యువకుడికి కూడా పేటీఎం కేవైసీ చేసుకోవాలని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి మేము పేటీఎం ప్రతినిధులను అని చెప్పి కేవైసీ చేయించుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వచ్చి ఉంటుంది అది చెప్పండి అని దాంతో ఆ వ్యక్తి వాళ్లకి ఓటిపి తెలియజేశాడు. దీనితో తన బ్యాంకు ఖాతాలో ఉన్న 89 వేల రూపాయలు హమ్ ఫట్... సైబర్ మోసగాళ్లకు పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా కూడా వారు లెక్కచేయడం లేదు అని చెప్పాలి. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే మంచిది అని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: