దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 3000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 150 మందికి పైగా మృతి చెందారు, 
 
మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని ఇతర పార్టీల నుంచి, ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో విఫలం కావడంతో భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్ శేఖర్ గుప్తా ట్విట్టర్ ఖాతా ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ముంబైకి ఆర్మీని పంపించి కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం కృషి చేయాలని కోరారు. ముంబైలోని స్లమ్ ఏరియాల్లో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని... ఉద్ధవ్ ఠాకరే ప్రభుత్వం కరోనాను కట్టడి చేస్తుందని తనకు నమ్మకం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మహారాష్ట్ర ప్రజల నుంచి కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరి శేఖర్ శర్మ సూచనల పట్ల కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో దినసరి కూలీలు, పేద ప్రజల కష్టాలు వర్ణనాతీతం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: