ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎంతోమంది జీవితాల‌ను త‌ల‌కిందులు చేసింది. సెల‌బ్రిటీలు సామాన్యులు అయ్యారు. సామాన్యుల‌కు క్వారంటైన్ల‌లో ఒక్కో చోట తిరుగులేని రాజ‌మ‌ర్యాద‌లు అందుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌స్తోన్న వారికి సైతం ప్ర‌భుత్వాలే క్వారంటైన్లు ఏర్పాటు చేసి ఏకంగా నెల రోజుల పాటు అన్నీ తామే ఖ‌ర్చు పెట్టుకుని పోషిస్తోన్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఓ దేశ రాజకుమారి త‌న దేశంలో క‌రోనా బాధితుల‌ను బ‌తికించుకునేందుకు ఏకంగా న‌ర్సు అవ‌తారం ఎత్త‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

 

ఆమె ఎవ‌రో కాదు స్వీడ‌న్ దేశ రాకుమారి సోఫియా. చైనాలో స్టార్ట్ అయిన ఈ వైర‌స్ ప్ర‌స్తుతం యూర‌ప్‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తోంది. యూర‌ప్‌లో జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇంగ్లండ్ దేశాల్లో ఇప్ప‌టికే కేసులు ల‌క్ష దాటాయి. ఈ దేశాల‌న్నింటిలోనూ ల‌క్ష‌కు పైమాట‌గానే కేసులు ఉన్నాయి. ఇక స్వీడ‌న్‌లో సైతం ఇప్ప‌టికే 13 వేల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టికే 1400 మంది మృతి చెందారు. ఈ క్ర‌మంలోనే దేశ రాకుమారి అయి ఉండి న‌ర్సు అవ‌తారం ఎత్తి ఎంతోమందిని బ‌తికించుకునేందుకు ఆమె చేస్తోన్న చ‌ర్య‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. సోఫియాను ప్ర‌పంచంలో ఉన్న సెల‌బ్రిటీలు ఆద‌ర్శంగా తీసుకుంటో ఎంతోమందికి మేలు చేసిన వారు అవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: