తెలంగాణలో ప్రస్తుతం బలమైన కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా ఉన్నారంటే.. ముందుగా వినిపించే పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి.  సూర్యాపేటలో 1962, జూన్ 20న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి, ఉషారాణి.   భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా తన సేవలనందించాడు. అతను ఎం.ఐ.జి 21, ఎం.ఐ.జి 23 విమానాలను నడిపాడు. అతను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించాడు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.

 

1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై 25,682 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తాజాగా రాజకీయాల్లోకి రాకముందు భారత వైమానిక దళంలో పని చేశారు. పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు ఇరువై ఏళ్లున్నప్పుడు తీసుకున్న మూడు ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిని ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారో కూడా తెలిపారు. 

 

మొదటి ఫోటో తాను కలైకుండ ఐఏఎఫ్ స్టేషన్‌లో  ఐఏఎఫ్ ఎయిర్ టు ఎయిర్ గన్నెరీ ఫైరింగ్ రికార్డు సందర్భంగా  తీసుకున్నదని చెప్పారు. రెండో ఫొటోను భారత్, పాకిస్థాన్ సరిహద్దు దగ్గర మిగ్ 23 ఎమ్‌ఎఫ్ స్వింగ్ వింగ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నడిమే ముందు తీసుకున్నది అన్నారు. ఇక ష్ట్రపతి భవన్‌లో డిప్యుటేషన్‌పై ఐఏఎఫ్‌లో ఫ్లైట్ లెఫ్ట్‌నంట్‌గా పని చేస్తున్నప్పుడు  తీసుకున్నది అని చెప్పారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: