ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 603కు చేరింది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం సీ.సీ.ఎల్.ఏ లో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ, అడిషనల్ అసిస్టెంట్ సెక్రటరీలు, సూపరిండెంట్ లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఈ నెల 20 నుంచి విధుల్లోకి రావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సీ.సీ.ఎల్.ఏ కార్యదర్శి పేరుతో ప్రభుత్వం నుంచి ఈరోజు సర్క్యులర్ విడుదల అయింది. ప్రభుత్వం సర్క్యులర్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, క్లాస్ ఫోర్ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం సర్క్యులర్ లో పేర్కొంది. అయితే ఈ కార్యాలయం విజయవాడలోని గొల్లపూడిలో ఉంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఇదివరకే రెడ్ జోన్ గా ప్రకటించింది. దీంతో ఉద్యోగులు విధులకు వెళ్లాలంటే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
సాధారణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెడ్ జోన్ లో ఉన్న పది శాతం మంది ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అందరు ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం మార్చుకుంటుందో లేదో చూడాలి.            
 
మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 603 కేసులు నమోదు కాగా వీరిలో 15 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: