హైద‌రాబాద్ వాసుల్లో గూడుక‌ట్టుకున్న ఓ భ‌యం నిజ‌మ‌య్యేలా క‌న‌బ‌డుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వెన‌క‌డుగు వేయ‌క‌పోవ‌డంతో వేరే మార్గం తోచ‌ని ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ పెంపున‌కే మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో మే నెలాఖారుకు వ‌ర‌కు కూడా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంద‌ని అప్పుడే కొన్ని వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య‌ను వారు ఇందుకు ఆధారంగా చూపుతున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన ప్రకారం మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అన్నిచోట్లా ఒకేవిధిగా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా హైదరాబాద్‌లో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


 జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 26 కరోనా కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు.ప్రజల ప్రాణాలనే కాదు, వారి జీవనోపాధిని సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రోజువారీ కార్మికులు, వలస కూలీల  క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం.


ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 154,320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 22.50 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 9,400 మంది మృతిచెందారు. ఇక క‌రోనా వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 5.72 లక్షల మంది కోలుకోవ‌డం కొంత ఆశాజ‌న‌క‌మైన విష‌యంగా చెప్పవ‌చ్చు. మరో 15 లక్షల మందిలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండగా, 57,130 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. అమెరికాలో కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని రీతిలో కల్లోలం సృష్టిస్తోంది. ఇక భార‌త్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌డిచిన నాలుగు రోజుల కాలంలో విప‌రీతంగా పెరిగాయి. దీంతో ఇప్ప‌ట్లో భార‌త్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేయ‌డం కుద‌ర‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: