దేశవ్యాప్తంగా పటిష్టంగా లాక్ డౌన్ అమలు అవుతున్న సమయంలో ప్రజలంతా తమ రోజువారి పనులు చేసుకోవడానికి విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా అతని తనయుడు వివాహం చేసిన విషయం దేశవ్యాప్తంగా పెద్ద వివాదం రేపింది. అందరూ మాత్రం ఆలస్యం చేయకుండా తన కొడుకు పెళ్ళి తంతును చాలా సింపుల్ గా కానిచ్చేశాడు.

 

కుమారస్వామి కొడుకు అయిన యంగ్ హీరో నిఖిల్ గౌడ్ యొక్క కొడుకు పెళ్లి రేవతి అనే యువతితో చాలా నిరాడంబరంగా జరిగింది. 100 మంది అతిథులు సమక్షంలో ఒక ఫామ్ హౌస్ లో పెళ్లి వేడుక జరపాలని అనుకున్న సమయానికి పెళ్లి ఆగకూడదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మేరకు నిర్ణయం తీసుకుని నిరాడంబరంగా వారి పెళ్లి వేడుకను నిర్వహించారు.

 

 

ఇప్పటికే కర్ణాటకలో 360 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ....కుమారస్వామి తన కొడుకు పెళ్లి అని చాలా నిరాడంబరంగా జరపడం ప్రశంసనీయమని మరియు అతి తక్కువ మంది పెళ్లికి హాజరయ్యేలా చూసుకోవడం కూడా చాలా మంచి పరిణామమని వ్యాఖ్యానించడం ఇప్పుడు పలు అభ్యంతరాలను చెబుతోంది.

 

బెంగళూరు రామ్‌నగర్‌ కేతగానహళ్లిలోని ఫాం హౌస్‌లో జరిగిన వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె రేవతి తల్లిదండ్రులు సహా కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ఇప్పటికే అక్కడ నుండి బయటకు వచ్చిన ఫోటోలలో అసలు సోషల్ డిస్టన్స్ పాటించనేలేదు.

 

సాక్షాత్తూ ముఖ్యమంత్రే పెళ్లిళ్లను, ఫంక్షన్లను ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే ఇక కరోనా కేసుల సంఖ్య తగ్గేది ఎలా అని పలువురు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: