కరోనా వైరస్ వల్ల అనేకమంది అవస్థలు పడుతున్నారు. మందులేని ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఉన్న నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు ప్రజలను కట్టడి చేయటానికి లాక్ డౌన్ అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇలానే ఉంది. ఇలాంటి టైమ్ లో కొంత మంది రాజకీయ నాయకులు చాలా అజ్ఞానం గా వ్యవహరిస్తున్నారు. ప్రజలను చైతన్య పరచడానికి కల్పించాల్సిన అంశాలపై దృష్టి పెట్టకుండా కరోనా వైరస్ ని అడ్డంపెట్టుకుని జనాలకి ప్రాసలు - ఆఫర్లు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.

 

ఒకపక్క కరోనా వైరస్ వల్ల జనాలు చనిపోతుంటే చీరాల నియోజకవర్గంలో “ఫోన్ కొట్టు ఆహారం పట్టు” అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వార్తపై చాలామంది ప్రజలు మరియు నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు చీరాల నియోజకవర్గంలో కరోనా వైరస్ బయటపడిన తరుణంలో ఈ నాయకులు ఎక్కడా కూడా కనబడలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నిత్యావసర సరుకుల విషయంలో ప్రజలు బయటకు వచ్చిన సందర్భంలో సోషల్ డిస్టెన్స్ అదేవిధంగా శానిటైజర్ వల్ల వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పిన దాఖలాలు కూడా లేవు.

 

ఇలాంటి తరుణంలో ప్రజల దగ్గరకు రాకుండా ఇంటి దగ్గర ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల చీరాల ప్రజలు అసహనం చెందుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరోనా వైరస్ పరీక్షలు కట్టుదిట్టంగా జరగాలని అధునాతన టెక్నాలజీ కలిగిన సౌత్ కొరియా నుండి టెస్టింగ్ కిట్లు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్ష చేసే ల్యాబ్ లు కూడా భారీ స్థాయిలో పెంచుతున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: