కరోనా వైరస్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. శుభకార్యాలు మరియు ఫంక్షన్ లు ఇంకేమి కూడా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులకు ఫుల్ పవర్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక ప్రబుద్ధుడు ‘కరోనా వైరస్ విందు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కొంతమందికి విందు ఏర్పాటు చేసి ఆ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. వీడియో లో జనం కూడా భారీగా రావటంతో... ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో తమిళనాడు పోలీసుల దృష్టికి వెళ్లింది.

 

దీంతో తమిళనాడు పోలీసులు ఆ వీడియో చూసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని మీద కేసులు నమోదు చేసారు. తమిళనాడు లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉన్నా సరే అక్కడి ప్రజలు మాత్రం ఎవరి మాట వినే పరిస్థితి కనపడటం లేదు. చెప్పిన వాళ్ళను కూడా వెటకారం గా చూస్తున్నారు అక్కడి జనాలు. ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనపడటం లేదని కరోనా వైరస్ కట్టడి విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

 

ఇలాంటి సమయంలో ఈ వీడియో బాగా వైరల్ అవడంతో కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా చూడటంతో తమిళనాడు పోలీసులు వెంటనే స్పందించినట్లు సమాచారం. అయితే అందరి కళ్ళు కప్పి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఈ మహానుభావుడికి...సోషల్ మీడియా దెబ్బ కి అడ్డంగా బుక్కయిన ట్లు అయ్యింది. దీంతో కరోనా వైరస్ పార్టీ ఇచ్చిన మహానుభావుడికి పోలీసులు తమదైన శైలిలో కోటింగ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: