అహ నా పెళ్ళంట మూవీ లో రాజేంద్రప్రసాద్ బట్టలు ఎందుకు దండగా పేపర్ మన దగ్గర ఉండగా అంటూ కేవలం న్యూస్ పేపర్ తన చుట్టూ చుట్టుకుంటాడు. పై చిత్రంలో కనిపిస్తున్న తెల్ల పిల్ల కూడా అలాగే అనుకున్నాదో ఏమో కానీ ఓ న్యూస్ పేపర్ యొక్క మెయిన్ ఎడిషన్ లోని 2 పేపర్లను మాత్రమే తనపై వేసుకుని తన రహస్యంగాలను దాచుకున్నది. ఆ ఫోటోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

 


వివరాలు తెలుసుకుంటే... ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపిస్తున్న ఆ యువతి పేరు డేనియల్లి హైమ్. తనకు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. వారి పేర్లు ఎస్టే హైమ్, అలానా హైమ్. ఈ ముగ్గురు కలసి 8 సంవత్సరాలుగా తమ ఇంగ్లీష్ పాటల ఆల్బమ్స్ లను విడుదల చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా సంగీత రంగంలో కాస్త నైపుణ్యం ఉన్న వారే. 2012లో ఈ ముగ్గురు అక్క చెల్లెలు కలసి ఫరెవర్ అనే ఒక మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేయగా... అది అమెరికా దేశం మొత్తంలో భారీగా హిట్ అయ్యింది. 

 

 


కాలిఫోర్నియాలోని లాస్ఏంజిల్స్ లో నివసిస్తున్న ఈ ముగ్గురు చెల్లెళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యూజిక్ టాలెంట్ ఉన్నది. ఒకరికి గిటార్ వాయించడంలో నైపుణ్యం ఉంటే... మరొకరికి పాట పాడటం లో నైపుణ్యం ఉండగా... మూడవ అమ్మాయికు గిటార్ ప్లే చేయడం, పాటలు పాడటంతో పాటు కీబోర్డు వాయించడం లో కూడా సూపర్ టాలెంట్ ఉన్నది. ప్రస్తుతానికి వీరు చేస్తున్న తమ మూడవ ఆల్బమ్ 'ఉమెన్ ఇన్ మ్యూజిక్ Pt.III' కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. సమ్మర్ లో తమ మూడవ ఆల్బం ని విడుదల చేయబోతున్నామని తాము ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. 

 


ఈ నేపథ్యంలోనే డేనియల్లి హైమ్ తన నివాసంలోని ఒక సోఫా పై పూర్తి నగ్నంగా పడుకొని కనిపించి వార్తలకెక్కింది. అయితే తాను లాస్ ఏంజెల్స్ టైమ్స్ అనే ఒక వార్త పత్రికను ప్రమోట్ చేయడానికే గుడ్డలు అంతా విప్పుకుని 'లాస్ ఏంజెల్స్ టైమ్స్' పేపర్ స్పష్టంగా కనిపించేలా తనపై కప్పుకున్నది. కేవలం ఒక పేపర్ ని సపోర్ట్ లేదా ప్రమోట్ చేయడానికి ఇలా ఏకంగా బట్టలు లేకుండా ఆమె చేసిన పని ప్రస్తుతం సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. తమ పేపరు సంస్థ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నా... ఒక యువతి ఇలా బట్టలు విప్పుకొని ప్రచారం చేసేందుకు సిద్ధపడినప్పుడు కనీసం ఆ పేపర్ యాజమాన్యమైన అభ్యంతరం చెప్పకపోవడం బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే 'లాస్ ఏంజెల్స్ టైమ్స్' వార్త పేపర్ మహిళా రిపోర్టర్ జాక్లిన్ కాస్గ్రోవ్ ఈ దిక్కుమాలిన ఫోటో కింద కామెంట్ చేస్తూ... మా పేపర్ కొనుక్కునందుకు... ప్రచారం చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఒకవేళ మన భారతదేశంలో ఎవరైనా ప్రముఖ సింగర్ ఇలా గుడ్డలు అంతా విప్పి ఒక వార్తా పత్రికకు సపోర్ట్ చేస్తే ప్రజలు ఎంత నీచంగా తిడతారో ఊహించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: