నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. కొన్నాళ్ళ క్రితం వరకూ నిమ్మగడ్డ అంటే ఓ పారిశ్రామికవేత్త పేరు వినిపించేది. ఇపుడు మాత్రం ఒకే ఒక నిమ్మగడ్డా. సోషల్ మీడియాలో సైతం మారుమోగుతున్న ఆ పేరే మాజీ ఎన్నికల అధకారి  నిమ్మగడ్డ రమేష్ కుమార్. 

 

నిమ్మగడ్డను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. దీని మీద హై కోర్టుకు నిమ్మగడ్డ  వెళ్ళారు. దీంతో ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. నిమ్మగడ్డ ఎందుకు వద్దు అన్న దాని మీదనే రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదీ కౌంటర్ దాఖలు చేశారు.

 

నిమ్మగడ్డ రాష్ట్రప్రభుత్వంతో విభేదించిన తీరు, ఆయన ప్రభుత్వానికి చెప్పకుండా మీడియా ముందుకు వెళ్ళి స్థానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని అందులో పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపైన చేసిన విమర్శలు కూడా ప్రస్తావించారు. తనకు ప్రస్తుత ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పిన నిమ్మగడ్డ నేత్రుత్వంలో స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలని కూడా ప్రభుత్వం ప్రశ్నించడం విశేషం.

 

ఇక నిమ్మగడ్డను తొలగించడం వెనక ఎటువంటి రాజకీయ దురుద్దేశాలూ లేవని కూడా పేర్కొన్నారు. ఇది గవర్నర్ కి ఉన్న హక్కు అని పేర్కొంటూ ఆయన తొల‌గించడం పూర్తిగా రాజ్యాంగబద్ధమని కూడా పేర్కొన్నారు. ఇక నిమ్మగడ్డ చెబుతున్నట్లుగా ఆయన పదవీ కాలం కుదింపు కూడా సర్వీస్ రూల్స్ లోకి రావని కూడా స్పష్టం చేశారు.

 

 

ఇదిలా ఉండగా ముగ్గురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఆద్వర్యంలో ఎన్నికలు నిర్వహించినా ఒకే. లేకపోయినా కేంద్ర ఎన్నికల సంఘం ఆద్వర్యంలో ఎన్నికలు జరిపించినా సమ్మతమేనని కూడా రాష్ట్రప్రభుత్వమే పేర్కొనడం విశేషం. మొత్తానికి నిమ్మగడ్డ పైన షాకింగ్ కామెంట్స్ ఈ కౌంటర్ పిటిషన్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: