ప్రపంచాన్ని ఇప్పుడ గడ గడాలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్ ని కూడా అతలా కుతలం చేస్తుంది.  జనాలకు స్వేచ్ఛలేకుండాపోయింది.. గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  వాణిజ్య వ్యవస్థ పూర్తిగా కుంటు పడింది.  కొత్తలో  కరోనా ఎక్కువగా విదేశీయు ల నుంచి వచ్చిందని అన్నారు.  కానీ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో తబ్లీఘీ జమాత్ సదస్సు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ కరోనా మహమ్మారి మరింత ప్రబలి పోయిందని అంటున్నారు.  దాంతో దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కేసుల సంఖ్య రోజుకు వెయ్యికిపైగా దాటిపోతోంది. మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

 

అయితే  పరిస్థితి ఇలాగే సాగితే లాక్ డౌన్ గడువు తేదీని వచ్చే నెల 3 తర్వాత కూడా పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఇక రంజాన్ మాసం లో పరిస్థితి ఏరకంగా ఉంటుందో ఊహించుకోవొచ్చు. ముఖ్యంగా తబ్లిగీల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో మూడింట ఒక వంతుకుపైగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలతో సంబంధమున్నవేనని కేంద్రం తెలిపింది. కేంద్ర వైద్యారోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ రోజు సాయంత్రం కేసుల తాజా వివరాలను వెల్లడించారు. మన దేశంలో 14,378 కేసులు ఉన్నాయి.

 

గత 24 గంటల్లో 991 కొత్తవి చేరాయి. మరో 43 మంది మృతిచెందడంతో మరణాలు 480కి చేరాయి. 23 రాష్ట్రాల్లోని  45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని అన్నారు. ఇప్పటివరకు 1992 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు లవ్ అగర్వాల్ చెప్పారు.  కరోనా కేసులు ఢిల్లీలోని జరగిన మర్కజ్ ప్రార్థనలకు సంబంధముంది.  తమిళనాడులో నమోదైన కేసుల్లో 84 శాతం అవే ఉన్నాయి. తెలంగాణలోని 766 కేసుల్లో 79 శాతం, యూపీ కేసుల్లో 59 శాతం, ఏపీలోని 572 కేసుల్లో 50 శాతం కేసులు మర్కజ్ లింకులు ఉన్నవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: