కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లకు సంబంధించిన ఒక కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనా నిర్ధార‌ణ‌కు ఈ టెస్ట్ కిట్లు ప్రామాణికం కాద‌ని  ఐసీఎంఆర్‌(Indian Council of Medical Research )  స్ప‌ష్టం చేసింది. ఇందులో నెగ‌టివ్ వ‌చ్చినంత మాత్రానా వారంద‌రికీ క‌రోనా రాలేద‌ని అర్థం కాద‌ని తేల్చిచెప్పింది.  కరోనా వైరస్‌ సోకిన తొలినాళ్లలో శరీరంలో దాని తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చు. వ్యాధి సైలెంట్ మోడ్‌లో విస్త‌రిస్తూ ఉంటుంది. అంతేకాదు.. అప్పుడు పరీక్ష చేసినా ‘నెగెటివ్‌’ వచ్చే అవకాశముంది. నెగెటివ్‌ వచ్చింద‌ని పూర్తిగా వారి ద్వారా మరికొందరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.


ఈ టెస్టు కిట్ల‌ను కేవ‌లం క‌రోనా అనుమానిత కేసుల విష‌యంలో మాత్ర‌మే వినియోగించాల‌ని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం... కరోనాకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు నిర్వహించాలి.  ‘‘కోవిడ్‌-19 నిర్ధారణకు రియల్‌టైమ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌ (ఆర్టీ-పీసీఆర్‌) ఒక్కటే ప్రధానమైన పరీక్ష. దీనికి ర్యాపిడ్‌ టెస్ట్‌ ప్రత్యామ్నాయం కాద‌ని స్ప‌ష్టం చేసింది. కరోనా లక్షణాలు మొదలైన వారం రోజుల తర్వాత మాత్రమే ర్యాపిడ్‌ టెస్ట్‌ పనికి వస్తుంద‌ని తెలిపింది. వ్యాధిపై అధ్యయనం, పరిశీలనకు మాత్ర‌మే  ర్యాపిడ్‌ టెస్టులు ఉపయోగపడతాయ‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ పరీక్షలను కూడా కచ్చితమైన వైద్య పర్యవేక్షణలోనే నిర్వహించాలని వివ‌రించింది.


 ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ద‌క్షిణ‌కొరియా నుంచి దాదాపు 10ల‌క్ష‌ల ర్యాపిడ్ కిట్ల‌ను తెప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దాదాపు ఒక ల‌క్ష కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. మ‌రో తొమ్మిది ల‌క్ష‌ల కిట్లు రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుతాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ప‌రీక్ష‌లు శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే.  మ‌రోవైపు రాష్ట్రంలో వేగంగా క‌రోనా వ్యాప్తి చెందుతుండ‌టం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతుండ‌టంతో ప్ర‌జల్లో భ‌యాందోళ‌న నెల‌కొంటోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: