దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనాలకు కష్టాలు మామూలుగా లేవు.  ప్రాణ భయంతో అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.. కానీ కొంత మంది మాత్రం  లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు.  అయితే తప్పని సరిపరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అంటున్నారు.  తాజాగా లాక్ డౌన్ కారణంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి మందులు తెచ్చుకోలేకపోతున్నానని ఓ ప్రైవేట్ ఛానల్ ద్వారా తన గోడు వెల్లబుచ్చాడు.  ఈ ప్రోగ్రామ్ చూసి బెంగుళూరు నగర కమిషనర్ కార్యాలయంలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ కుమార్ స్వామి చలించిపోయాడు.  

 

 

ఉన్నతాధికారుల అనుమతితో బైక్ పై బయలు దేరాడు.. ఒకటీ రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 960 కి. మీ. ల దూరంలో ఉన్న ఆ వ్యక్తి ఇంటికి చేరుకొని మందులు ఇచ్చి ఆనంద పరిచాడు.  ఆయన మానవత్వానికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు యావత్ ప్రజానికం హర్షం వ్యక్తం చేశారు. నిజంగా మనిషికి మనిషి సహాయం చేసుకోవడం అంటే ఇంతకన్న మరోఉదాహారణ ఉంటుందా అని ఆ కానిస్టేబుల్ పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. 

 


 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: